Telangana ICET 2023 : ఐసెట్ 2023 నోటిఫికేషన్ రిలీజ్
ప్రకటించిన తెలంగాణ రాష్ట్రం
Telangana ICET 2023 : ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న తెలంగాణ ఐసెట్ -2023(Telangana ICET 2023) నోటిఫికేషన్ ను ప్రభుత్వం విడుదల చేసింది. దీనిని కాకతీయ యూనివర్శిటీ నిర్వహిస్తూ వస్తోంది. ఇప్పటి వరకు 13 సార్లు ఐసెట్ ను నిర్వహించిన ఘనత సదరు యూనివర్శిటీకే దక్కుతుంది.
రాష్ట్రంలో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి దీనిని విడదుల చేసినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి వెల్లడించారు. ఈ సంవత్సరం కూడా కేయూ యూనివర్శిటీనే దీనిని కండక్ట్ చేస్తుందని స్పష్టం చేశారు. నోటిఫికేషన్ ప్రకారం వచ్చే మే 26,27 తేదీలలో ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి.
ఇక ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే ప్రక్రియ మార్చి 6 నుంచి ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. ఎలాంటి ఆలస్యం లేకుండా అయితే మార్చి 6 వరకు దరఖాస్తు చేసుకునేందుకు వీలుందని తెలిపారు.
ఒకవేళ ఆలస్యం జరిగితే రూ. 250 తో మే వరకు , రూ. 500 ఆలస్య రుసుముతో మే 18 వరకు దరఖాస్తు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగినట్లయితే లేదా తప్పుగా దరఖాస్తులు నింపినట్లయితే వాటిని సరి చేసుకునేందుకు కూడా ఛాన్స్ ఇస్తున్నట్లు తెలిపారు లింబాద్రి.
తప్పులను సరిదిద్దుకునే ఛాన్స్ మే 12 నుంచి మే 18 దాకా అవకాశం ఉందన్నారు . ఇక అధికారిక వెబ్ సైట్ నుంచి మే 22 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మే 26, 27 తేదీల్లో 75 కేంద్రాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల దాకా ప్రవేశ పరీక్షలు ఆన్ లైన్ లో ఉంటాయని పేర్కొన్నారు. జూన్ 20న ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి తెలిపారు.
Also Read : టాప్ లో ఉన్నా తొలగించిన గూగుల్