Satyendar Jain : అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్
కేజ్రీవాల్ కు రాసిన లేఖలో సత్యేంద్ర జైన్
Satyendar Jain Quits : మనీ లాండరింగ్ కేసు లో అరెస్టై తీహార్ జైలులో ఉన్న సత్యేంద్ర జైన్ తన మంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. ఆయన స్వయంగా తన చేతి రాతతో లేఖను రాయడం విశేషం. తనకు మంత్రి పదవి కట్టబెట్టినందుకు ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. జైన్ రాసిన లేఖలో ఢిల్లీ ఎన్సీటీడీ ప్రభుత్వ మంత్రి పదవికి రాజీనామా(Satyendar Jain Quits) చేస్తున్నా. ఢిల్లీ ప్రజలకు సేవ చేసే భాగ్యం నాకు కలిగింది.
దీనిని కల్పించిన మీకు సర్వదా రుణపడి ఉంటానని పేర్కొన్నారు. నా రాజీనామాను దయతో ఆమోదించగలరు అని కోరారు సత్యేంద్ర జైన్. విచిత్రం ఏమిటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన మనీష్ సిసోడియా, మనీ లాండరింగ్ వ్యవహారంలో జైలుకు వెళ్లిన సత్యేంద్ర జైన్(Satyendar Jain) ఇద్దరూ సీఎం కేజ్రీవాల్ రెండు భుజాల లాంటి వాళ్లు. అత్యంత నమ్మకస్తులు కూడా. దేశ రాజధానిలో నాణ్యమైన విద్య, ఆరోగ్య సౌకర్యాల కోసం కేజ్రీవాల్ పాలనా ఎజెండాను అమలు చేయడంలో ఇద్దరు నాయకులు కీలక పాత్ర పోషించారు.
ఇద్దరి రాజీనామాలను ఆమోదం కోసం సీఎం కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు పంపించారు. ఈ విషయాన్ని ఆప్ బుధవారం ధ్రువీకరించింది కూడా. ఇక మనీ లాండరింగ్ కేసులో జైన్ ను ఈడీ గత ఏడాది మేలో అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి నేటి దాకా భారతీయ జనతా పార్టీ ఆయనను రాజీనామా చేయాలని కోరుతోంది. జైన్ ప్రభుత్వంలో ఎలాంటి పోర్ట్ ఫోలియో లేకుండానే కొనసాగారు.
Also Read : కేజ్రీవాల్ కేబినెట్ లో ఇద్దరికి ఛాన్స్