Mithali Raj Dance Viral : మిథాలీ రాజ్ డ్యాన్స్ అదుర్స్
శ్రీలంక హిట్ సాంగ్ మానికే మాగే హితే
Mithali Raj Dance Viral : భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ , గుజరాత్ టైటాన్స్ మహిళా టీం కోచ్ , మెంటార్ గా ఎంపికైన మిథాలీ రాజ్ హాట్ టాపిక్ గా మారారు. శనివారం నుంచి బీసీసీఐ ఆధ్వర్యంలో తొలిసారిగా మహిళా ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే సదరు టీంకు సంబంధించి జెర్సీ కూడా ఆవిష్కరించింది యాజమాన్యం. ఆర్సీబీ, ముంబై, గుజరాత్ , ఢిల్లీ క్యాపిటల్స్ , వారియర్స్ టీంలు ప్రస్తుతం తొలి సీజన్ లో ఆడనున్నాయి.
తమ అదృష్టాన్ని పరీక్షించు కోనున్నాయి. ఆయా జట్లు తమ జెర్సీలను ఆవిష్కరించాయి. ఇదిలా ఉండగా మిథాలీ రాజ్(Mithali Raj) తన జట్టు ఆటగాళ్లను మరింత ప్రోత్సహించేందుకు గాను ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా వరల్డ్ వైడ్ గా మోస్ట్ పాపులర్ అయిన శ్రీలంకకు చెందిన హిట్ సాంగ్ మానికే మాగే హితే కు డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. క్రికెటర్ కాక ముందు మిథాలీ రాజ్ భరత నాట్యంలో శిక్షణ కూడా పొందారు.
మాజీ క్రికెటర్లు, ప్రస్తుత ఆటగాళ్లతో పాటు క్రికెట్ ఫ్యాన్స్ మిథాలీ రాజ్ డ్యాన్స్ కు(Mithali Raj Dance Viral) ఫిదా అయ్యారు. ఇక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్ తో గుజరాత్ జెయింట్స్ టీం తలపడనుంది.
గత ఏడాది అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించిన భారత మహిళా జట్టు మాజీ స్కిప్పర్ ఇప్పుడు డబ్ల్యూపీఎల్ లో కొత్త పాత్రలో కనిపించబోతోంది. ప్రాంఛైజీ మెంటార్ గా గుజరాత్ జెయింట్స్ కు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఏది ఏమైనా మిథాలీ రాజ్ ఇప్పుడు వార్తల్లో నిలిచింది.
Also Read : సూర్యుడు..సముద్రం ఆదర్శం