Sheezan Khan Bail : నటుడు షీజాన్ ఖాన్ కు బెయిల్
సీరియల్ నటి హత్య కేసులో నిందితుడు
Sheezan Khan Bail Grant : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నటి తునీషా శర్మ హత్య కేసులో కీలక నిందితుడిగా జైలు పాలైన నటుడు షీజాన్ కాన్ ఖాన్ కు బెయిల్ మంజూరైంది. గత ఏడాది 2022 లో సహ నటి తునీషా శర్మ(Tunisha Sharma) ఆత్మహత్యకు ప్రేరేపించాడని ఆరోపణలపై అరెస్ట్ అయ్యాడు. మహారాష్ట్ర లోని పాల్గర్ జిల్లాలోని వసాయ్ లోని కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. నటుడు తన పాస్ పోర్టును అప్పగించాలని ఆదేశించింది కోర్టు.
ఇదిలా ఉండగా తన కూతురును ప్రేమించానని నమ్మించి మోసం చేశాడని, పెళ్లి చేసుకుంటానని చెప్పి తనే చంపాడని , ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడంటూ షీజాన్ ఖాన్(Sheezan Khan) పై సీరియస్ కామెంట్స్ చేసింది మృతురాలి తల్లి. తునీషా శర్మ డిసెంబర్ 24, 2022న పాల్ఘర్ లోని వలివ్ సమీపంలో ఒక టీవీ సీరియల్ సెట్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తునీషా శర్మ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 28 ఏళ్ల షీజాన్ ఖాన్ ను మరుసటి రోజు డిసెంబర్ 25న అరెస్ట్ చేశారు.
ఆనాటి నుంచి నేటి దాకా జైలులోనే ఉన్నాడు. అయితే తనకు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. సీజాన్ ఖాన్(Sheezan Khan Bail Grant) రూ. 1,00,000 పూచీ కత్తుపై విడుదల చేయాలని అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఆర్డీ దేశ్ పాండే ఆదేశించారు. కోర్టు ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్ల వద్దని స్పష్టం చేసింది. ఖాన్ తరపు న్యాయవాది శరద్ రాయ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ కేసులో ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలు చేశారని , విచారణ ముగిసిందన్నారు.
Also Read : నటుడు టామ్ సైజ్ మోర్ కన్నుమూత