Grace Harris : గ్రేస్ హ్యారీస్ సెన్సేషన్ ఇన్నింగ్స్
గుజరాత్ జెయింట్స్ కు బిగ్ షాక్
Grace Harris : గెలుపు అంటే ఏమిటో దాని మజా ఏమిటో రుచి చూపించింది ఆస్ట్రేలియా జట్టుకు చెందిన గ్రేస్ హ్యారీస్ . యూపీ వారియర్స్ మేనేజ్ మెంట్ ఉమెన్స్ ప్రీమీయర్ లీగ్ వేలంలో ఏరికోరి ఎంచుకుంది. వారి అంచనా తప్ప లేదు. గుజరాత్ జెయింట్స్ చేసిన భారీ స్కోర్ ను అవలీలగా చేదించడంలో కీలక పాత్ర పోషించింది. ఒకానొక దశలో ఆఖరి ఓవర్ లో 6 బంతులు 19 పరుగులు చేయాల్సి ఉంది. కానీ ఇంకొకరైతే గుజరాత్ గెలుస్తుందని అనుకుంటారు.
కానీ మైదానంలో ఉన్న స్టార్ హిట్టర్ గా ఇప్పటికే పేరు పొందిన గ్రేస్ హ్యారీస్ మారథాన్(Grace Harris) ఇన్నింగ్స్ ఆడింది. ఇంకా ఒక బంతి మిగిలి ఉండగానే టార్గెట్ ను ఛేదించింది. కీలక ఓవర్ లో 2 ఫోర్లు 2 సిక్సర్లు కొట్టింది గ్రేస్ హ్యారీస్. ఇక గుజరాత్ జెయిండ్స్ ఆశలపై నీళ్లు చల్లింది. ఇదే సమయంలో ఆ జట్టుకు చెందిన సీమర్ కిమ్ గార్త్ తన నాలుగు ఓవర్ల కోటాలో 36 రన్స్ ఇచ్చి 5 వికెట్లు పడగొట్టింది.
నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో చివరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. నువ్వా నేనా అన్న రీతిలో సాగిన ఈ మ్యాచ్ ను ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేశారు. ఇక గ్రేస్ హ్యారీస్ కేవలం 26 బంతులు మాత్రమే ఎదుర్కొంది. 59 రన్స్ చేసి యూపీ వారియర్స్ విజయంలో కీలక పాత్ర పోషించింది. గెలవదనుకున్న మ్యాచ్ ను తన జట్టుకు అందించింది.
మొత్తంగా ఈ టోర్నీలో గుజరాత్ జెయింట్స్ కు ఇది వరుసగా రెండో ఓటమి. తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తో భారీ తేడాతో ఓటమి పాలైంది.
Also Read : యూపీ వారియర్స్ గ్రాండ్ విక్టరీ