MI vs RCB WPL 2023 : స‌మ ఉజ్జీల పోరుపై ఉత్కంఠ

ముంబై ఇండియ‌న్స్ వ‌ర్సెస్ ఆర్సీబీ

MI vs RCB WPL 2023 : మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్ (డ‌బ్ల్యూపీఎల్) 2023లో(WPL 2023) ప్ర‌తి మ్యాచ్ ఉత్కంఠ భ‌రితంగా సాగుతోంది. క్రికెట్ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ప్ర‌పంచ క్రికెట్ లో తొలిసారిగా బీసీసీఐ ఐపీఎల్ నిర్వ‌హిస్తోంది.

మొత్తం 5 జ‌ట్లు పాల్గొంటుండ‌గా ఇప్ప‌టికే విజ‌యం సాధించి ముంబై ఇండియ‌న్స్ టాప్ లో కొన‌సాగుతోంది. తొలి మ్యాచ్ లో గుజ‌రాత్ జెయింట్స్ ను 143 ప‌రుగుల భారీ తేడాతో ఓడించింది. 

ఇక డ‌బ్ల్యూపీఎల్ లో అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడు పోయిన స్మృతీ మంధాన సార‌థ్యంలోని రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్సీబీ) ఢిల్లీ క్యాపిట‌ల్స్ చేతిలో 60 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. 

ప్రస్తుతం ముంబై ఇండియ‌న్స్ కు హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ సార‌థ్యం వ‌హిస్తోంది. ఇక ఇద్ద‌రూ భార‌త జ‌ట్టుకు ఒక‌రు కెప్టెన్ , మ‌రొక‌రు వైస్ కెప్టెన్ కావ‌డం విశేషం. 

ఇద్ద‌రి మ‌ధ్య అస‌లైన పోరు ఇవాళ ముంబై వేదిక‌గా జ‌ర‌గ‌నుంది. కౌర్ సూప‌ర్ ఫామ్ లో ఉంది. ఆమెను నిలువ‌రించ‌డంపైనే ఆర్సీబీ ఫోక‌స్(MI vs RCB WPL 2023)  పెట్టాల్సి ఉంది. ఇక తొలి మ్యాచ్ లో ఓట‌మి పాలైన ఆర్సీబీ ఎలాగైనా గెల‌వాల‌నే క‌సితో ఉంది. 

ఢిల్లీపై మంధాన 35 ప‌రుగుల‌తో సూప‌ర్ ఇన్నింగ్స్ ఆడింది. ఇరు జ‌ట్ల కెప్టెన్లు సూప‌ర్ ఫామ్ లో ఉన్నారు. బౌలింగ్ ప‌రంగా ఇంగ్లాండ్ హాఫ్ స్పిన్న‌ర్ హీథ‌ర్ నైట్ గ‌నుక మ‌రోసారి రాణిస్తే ముంబైకి ఇబ్బంది ఎదుర‌వుతుంది. బ్యాటింగ్ ప‌రంగా కూడా త‌క్కువ అంచ‌నా వేసేందుకు వీలులేదు. ఇక ముంబైలో మ‌రో ప్లేయ‌ర్ అమేలియా ఫామ్ లో ఉంది. 

గుజ‌రాత్ పై 45 ర‌న్స్ చేసింది. మ‌రో వైపు ముంబై ఇండియ‌న్స్ లో సైకా ఇషాక్ త‌న బంతుల‌తో మ్యాజిక్ చేస్తోంది. కేవ‌లం 3.1 ఓవ‌ర్లు వేసి నాలుగు వికెట్లు తీసింది. ఆమెతో చాలా జాగ్ర‌త్త‌గా ఆడాల్సి ఉంది ఆర్సీబీ.

Also Read : ఢిల్లీ ఝ‌ల‌క్ బెంగ‌ళూరుకు షాక్

Leave A Reply

Your Email Id will not be published!