KTR Sania Mirza : సానియా మీర్జా దేశానికి గర్వ కారణం
ప్రశంసలు కురిపించిన మంత్రి కేటీఆర్
KTR Sania Mirza : ఈ దేశం గర్వించ దగిన క్రీడాకారిణుల్లో సానియా మీర్జా ఒకరని ప్రశంసలు కురిపించారు ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్. ఇటీవలే సుదీర్ఘ కాలం పాటు టెన్నిస్ రంగంలో ఆడి నిష్క్రమించింది. ఆటకు గుడ్ బై చెప్పింది. ఈ సందర్బంగా హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్ , మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. సానియా మీర్జాను(KTR Sania Mirza) ఘనంగా సన్మానించారు. ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం తరపున జ్ఞాపికను కేటీఆర్ బహూకరించారు.
సానియా మీర్జా ఎంతో కష్ట పడింది. ఈ స్థాయికి చేరుకుంది. ఇవాళ క్రీడా రంగం అంటేనే సానియా మీర్జా గుర్తుకు వచ్చేలా తనను తాను మల్చుకున్న తీరు ప్రశంసనీయమన్నారు మంత్రి కేటీఆర్(KTR). ఆమె ఈ స్థాయిలో ఎదగడం వెనుక తన తండ్రి, తల్లితో పాటు కుటుంబం కూడా ఉందని వారిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. ఎన్నో అవార్డులు, మరెన్నో పురస్కారాలు ఆమెకు దక్కాయని, ఆమె సాధించిన రికార్డులకు లెక్కే లేదన్నారు.
ఇవాళ మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని చెప్పేందుకు సానియా మీర్జా ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. ఇలాంటి వాళ్లే దేశానికి కావాలన్నారు. ఆమె సేవలను రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటుందని స్పష్టం చేశారు. నేటి యువత సానియా మీర్జా(Sania Mirza) ను స్పూర్తి దాయకంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. పట్టుదల, కష్టపడే తత్వం, ఆత్మ విశ్వాసం , సాధించాలన్న కసి తనను ఇంత స్థాయికి తీసుకు వచ్చేలా చేసిందని ప్రశంసలతో ముంచెత్తారు కేటీఆర్.
Also Read : సమ ఉజ్జీల పోరుపై ఉత్కంఠ