Anand Mahindra Bill Gates : బిల్ గేట్స్ కు మహీంద్రా ప్రతిపాదన
డ్రాగ్ రేస్ కు కు రెడీ అంటూ కామెంట్స్
Anand Mahindra Bill Gates : మైక్రో సాఫ్ట్ కో ఫౌండర్ , బిలిగేట్స్ , మిలిండా ఫౌండేషన్ చైర్మన్ బిలిగేట్స్ భారత్ లో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన పలువురు ప్రముఖులను కలుసుకున్నారు. కలిసిన వారిలో మాజీ క్రికెటర్ సచిన్ రమేష్ టెండూల్కర్ , భార్య అంజలితో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తి కాంత దాస కూడా ఉన్నారు. అనంతరం ప్రముఖ వ్యాపారవేత్త మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తో కూడా భేటీ అయ్యారు. వ్యాపార, ఇతర అంశాలపై కూడా పంచుకున్నారు.
ఇదిలా ఉండగా ప్రతి సోమవారం ఓ ఆసక్తికరమైన, స్పూర్తి దాయకమైన అంశాన్ని పంచుకుంటారు ఆనంద్ మహీంద్రా. ఆయన చేసే ట్వీట్లకు పెద్ద ఎత్తున ఆదరణ ఉంటుంది. ఇవాళ ఆనంద్ మహీంద్ర(Anand Mahindra Bill Gates) చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఇందులో భాగంగా బిల్ గేట్స్ మధ్య డ్రాగ్ రేస్ ను ప్రతిపాదించారు. బిల్ గేట్స్ ఈ రిక్షా నడుపుతున్న వీడియోను పంచుకున్నారు. చల్తీ కా నామ్ గాడి చిత్రం లోని ప్రసిద్ద కిషోర్ కుమార్ పాట ప్లే అవుతుంది.
ఆనంద్ మహీంద్రా ..బిల్ గేట్స్ ..సచిన్ టెండూలర్ మధ్య 3 వీలర్ డ్రాగ్ రేస్ ను ప్రతిపాదించారు. ఇన్నోవేషన్ పట్ల భారత దేశం అభిరుచి ఎప్పుడూ ఆశ్చర్య పర్చదని పేర్కొన్నారు. తాను 131 కిలోమీటర్లు వరకు ప్రయాణం చేసే ఎలక్ట్రిక్ రిక్షాను నడిపానని తెలిపారు. అది నలుగురిని మోసుకు వెళ్లవచ్చని తెలిపారు. ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
Also Read : విప్రో దిగ్గజాలతో బిల్ గేట్స్