Amma Cheti Vanta Bhargavi : ‘అమ్మ చేతి వంట’ అద్భుతం

క‌మ్మ‌ని తీయ‌ని భార్గ‌వి వంట‌కం

Amma Cheti Vanta Bhargavi : సామాజిక మాధ్య‌మాలు వ‌చ్చాక జీవితం చాలా ఆనంద‌మై పోయింది. గూగుల్ పుణ్య‌మా అని యూట్యూబ్ రాక‌తో వేలాది మందికి ఉపాధి దొరుకుతోంది. అంతేనా ఆదాయం స‌మ‌కూరేలా చేస్తోంది. ఔత్సాహికుల‌కు ఇదో అద్భుత‌మైన మాధ్య‌మంగా మారి పోయింది. అందులో మోస్ట్ పాపుల‌ర్ అవుతున్న వాళ్లు ఎంద‌రో.

ఇక ఒక గృహిణిగా కేవ‌లం వంట‌ల ద్వారా అద్బుతం చేసి చూపిస్తోంది భార్గ‌వి. ఆమె వంటలు ఎలా చేయాలో చెబుతుంది. కేవ‌లం మ‌న‌తో మాట్లాడిన‌ట్లుగా ఉంటుంది. అందుకే త‌న యూట్యూబ్ ఛాన‌ల్ కు అమ్మ చేతి వంట అని పేరు పెట్టింది. 

పూర్తి సంప్ర‌దాయ బ‌ద్దంగా ఉండే ఆమె క‌ట్టు, బొట్టు, వ‌స్త్ర‌ధార‌ణ‌, అందం, మాట తీరు , చెప్పే విధానం ల‌క్ష‌ల్లో వ్యూస్ వ‌చ్చేలా చేశాయి. ఎవ‌రికైనా అమ్మ చేతితో ఏది చేసినా అది అద్భుతంగా ఉంటుంది. 

అందుకే తాను కూడా ఆ పేరే పెట్టాన‌ని అంటుంది భార్గ‌వి. టాప్ యూట్యూబ‌ర్ల‌లో భార్గ‌వి కూడా ఒక‌రు.  త‌న‌దైన శైలిలో వంట‌లు చేస్తూ యువ‌తీ యువ‌కుల‌కు , మ‌హిళ‌ల‌కు మార్గ‌ద‌ర్శ‌కంగా మారారు. ఒక ర‌కంగా స్పూర్తి నింపుతున్నారు అమ్మ చేతి వంట భార్గ‌వి(Amma Cheti Vanta Bhargavi) . 

2017 జ‌న‌వ‌రిలో త‌ల్లి గీతా మ‌హాల‌క్ష్మి ఇచ్చిన స‌ల‌హా ఇవాళ పాపుల‌ర్ అయ్యేలా చేసింది. వంట‌లు చేసి వీడియోలు పెట్ట‌మ‌ని సూచించింది. అదే స‌క్సెస్ కు మూల మంత్రంగా ప‌ని చేసింది. 

మే 31న ప్రారంభ‌మైన అమ్మ చేతి వంట ఇప్పుడు ల‌క్ష‌లాది మందికి ఇష్ట‌మైన వంటిల్లుగా మారింది. ఇది క్లిక్ కావ‌డంతో మ‌న‌లో మ‌న మాట అని మ‌రో యూట్యూబ్ ఛాన‌ల్ కూడా స్టార్ట్ చేసింది భార్గవి. మ‌నం రోజూ వారీగా వాడే వంట‌ల‌తో పాటు పండుగ‌లు, ఫంక్ష‌న్ల‌లో వాడేవి కూడా త‌యారు చేసి వీడియోలు పోస్ట్ చేస్తోంది భార్గ‌వి. 

వీటిలో ప‌చ్చ‌ళ్లు , కేక్ లు, స‌మోసాలు..ఇలా ప్ర‌తిదీ ఆమె చేతిలో రూపు దిద్దుకున్న‌వే. వెజిటేరియ‌న్ కాదు నాన్ వెజిటేరియ‌న్ కూడా చేస్తోంది. మంచి కంటెంట్ ఉంటే ఎవ‌రైనా చూస్తార‌ని అంటోంది భార్గ‌వి. ల‌క్ష‌ల్లో ఆదాయం అమ్మ చేతి వంట‌కు ద‌క్కుతోంది.

Also Read : ల‌క్ష్యం గొప్ప‌దైతే విజ‌యం మ‌న‌దే

Leave A Reply

Your Email Id will not be published!