MLC Kavitha Pillai : పిళ్లై అంగీకారం క‌విత‌కు ప్ర‌మాదం

ఎమ్మెల్సీ ప్ర‌తినిధిన‌న్న రామ‌చంద్ర

MLC Kavitha Pillai : తెలంగాణ‌లో రాజ‌కీయం ర‌స‌కందాయంలో ప‌డింది. నిన్న‌టి దాకా బీరాలు ప‌లికిన ఎమ్మెల్సీ క‌విత ఇప్పుడు ప్ర‌మాదంలో ప‌డింది. ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టింది.

త‌న చేతికి ఉన్న వాచ్ ఖ‌రీదు రూ. 20 ల‌క్ష‌లు అని బ‌హిరంగంగా చెప్ప‌డం చ‌ర్చ‌కు దారి తీసేలా చేసింది. ఇంత డ‌బ్బులు ఎలా వ‌చ్చాయంటూ జ‌నం అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. 

ఇదే క్ర‌మంలో మ‌ద్యం కుంభ‌కోణంలో గ‌త కొంత కాలంగా క‌విత పేరు వినిపిస్తూనే వ‌చ్చింది. సీబీఐ హైద‌రాబాద్ లో విచారించింది. ఈ కేసులో 34 మందిపై సీబీఐ అభియోగాలు మోపింది. 

డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియాతో పాటు మొత్తం 11 మందిని అరెస్ట్ చేసింది. సీబీఐ ఛార్జ్ షీట్ లో స్ప‌ష్టంగా ఎమ్మెల్సీ క‌విత పేరుతో పాటు ఆప్ చీఫ్ అర‌వింద్ కేజ్రీవాల్ ను ప్ర‌స్తావించింది. దీనిని క‌విత కొట్టి పారేసింది. తాను క‌డిగిన ముత్యాన్ని అని, తెలంగాణ త‌ల వంచ‌ద‌ని స్ప‌ష్టం చేసింది. 

తాజాగా ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు అరుణ్ రామ‌చంద్ర పిళ్లై. ఈడీ విచార‌ణ‌లో తాను క‌విత ప్ర‌తినిధినంటూ ఒప్పుకున్నారు. దీంతో స్కాం మొత్తం ఇప్పుడు క‌విత చుట్టూ చేరింది. పిళ్లై హైద‌రాబాద్ కు చెందిన వ్యాపార‌వేత్త‌. అత‌డిని అరెస్ట్ చేసింది ఈడీ. 

కోర్టులో కూడా హాజ‌రు ప‌ర్చింది. అత‌డు కేసుకు సహ‌క‌రించ‌డం లేద‌ని, క‌స్ట‌డీ త‌ప్ప‌నిస‌రి కాబ‌ట్టి 7 రోజులు ఇవ్వాల‌ని ఈడీ కోర్టును కోరింది. న‌గ‌దు రూ. 25 కోట్లు బ‌దిలీ చేశారంటూ ఆరోపించింది. 

ఇండో స్పిరిట్ లో రామ‌చంద్ర పిళ్లై(MLC Kavitha Pillai)  కీల‌క భాగ‌స్వామి అని పేర్కొంది. మ‌ద్యం స‌మావేశాల్లో అత‌డు కూడా పాల్గొన్నాడ‌ని తెలిపింది. ఇందులో క‌విత కూడా ఉన్నార‌ని వెల్ల‌డించింది. మ‌ద్యం స్కామ్ లో స‌మీర్ మ‌హేంద్ర‌తో పాటు పిళ్లై కీల‌క పాత్ర పోషించారు. 

సౌత్ గ్రూప్ చెల్లించిన కిక్ బ్యాక్ మొత్తాన్ని పిళ్లై పంపించారంటూ తెలిపారు. బుచ్చిబాబు, అరుణ్ పిళ్లై క‌లిసి విచారించింది ఈడీ. దీంతో ఎమ్మెల్సీ క‌విత(MLC Kavitha) అరెస్ట్ త‌ప్ప‌ద‌ని తేలి పోయింది.

Also Read : ధ‌ర్నా సాగేనా అరెస్ట్ జ‌రిగేనా

Leave A Reply

Your Email Id will not be published!