Deepika Padukone : దీపికా ప‌దుకొణే షాకింగ్ కామెంట్స్

బికినీ వివాదంపై స్పందించిన న‌టి

Deepika Padukone Pathan : బాలీవుడ్ న‌టి దీపికా ప‌దుకొణే సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆమెతో పాటు బాద్ షా షారుఖ్ ఖాన్ క‌లిసి న‌టించిన ప‌ఠాన్ సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఇంకా వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది. ఏకంగా రూ. 1,000 కోట్ల‌ను క్రాస్ చేసింది. రికార్డు సృష్టించింది. ఈ చిత్రంలో దీపికా ప‌దుకొనే హాట్ టాపిక్ గా మారారు. ఎందుకంటే బేష‌ర‌మ్ సాంగ్ లో షారుఖ్ ఖాన్ , దీపికా క‌లిసి రెచ్చి పోయారు. ఆమె ఆ పాట‌లో పూర్తిగా బికినీ డ్రెస్ లో న‌టించింది.

దీనిపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం చెల‌రేగింది. ఇదిలా ఉండ‌గా దీపికా ప‌దుకొనే ప్ర‌స్తుతం ప‌ఠాన్ విజ‌యాన్ని ఎంజాయ్ చేస్తోంది. షారుఖ్ ఖాన్ దీపికా(Deepika Padukone Pathan) క‌లిసి విజ‌యోత్స‌వ యాత్ర చేస్తున్నారు. ఈ సంద‌ర్బంగా తాను ధ‌రించిన బికీనీ డ్రెస్ పై కీల‌కంగా స్పందించింది. ఆమె ఎవ‌రో కాదు ప్ర‌ముఖ భార‌తీయ బ్యాడ్మింట‌న్ క్రీడాకారు ప్ర‌కాష్ ప‌దుకొణే ముద్దుల కూతురు. దీపికా ర‌ణ్ బీర్ సింగ్ క‌పూర్ ను పెళ్లి చేసుకుంది.

పెళ్లి కంటే ముందు ఆమె మానసికంగా ఇబ్బందుల‌కు గురైంది. తాజాగా త‌న కెరీర్ లో ఊహించ‌ని స‌క్సెస్ ను మిగిల్చింది ప‌ఠాన్. ఈ సంద‌ర్భంగా కీల‌క కామెంట్స్ చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. నేను క్రీడా కారుల కుటుంబం నుంచి వ‌చ్చా. ఎన్నో ఆట‌ల్లో భాగ‌మ‌య్యాను. సంక్షోభం స‌మ‌యంలో ఎలా ఎదుర్కోవాల‌నే దానిని క్రీడ‌ల నుంచి నేర్చుకున్నాన‌ని చెప్పారు న‌టి దీపికా ప‌దుకొణే.

Also Read : కాజల్ ఆగేర్వాల్ మోస్ట్ బ్యూటిఫుల్స్

Leave A Reply

Your Email Id will not be published!