Rajeev Chandrasekhar : డిజిటల్ ఇండియా బిల్లుపై ఫోకస్
సేఫ్ హార్బర్ క్లాజ్ పై కొనసాగుతున్న చర్చ
Rajeev Chandrasekhar Digital India : కేంద్రం త్వరలోనే డిజిటల్ ఇండియా బిల్లును తీసుకు రానుంది. దశాబ్దాల నాటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం స్థానంలో కొత్తగా డిజిటల్ ఇండియా బిల్లును సిద్దం చేస్తోంది. ఇప్పటి వరకు మూడు రౌండ్ల చర్చలు జరిగాయి. అడ్డు అదుపు లేకుండా కొనసాగుతున్న డిజిటల్ టెక్నాలజీపై మరింత నియంత్రణ సాధించేందుకు కేంద్రం ఫోకస్ పెడుతోంది. ఈ మేరకు సంబంధిత ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ దీనిపై ఎక్కువగా దృష్టి పెట్టారు.
వినియోగదారుల పోస్టులకు సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ల బాధ్యతను తొలగించే సేఫ్ హార్బర్ నిబంధనను ప్రభుత్వం సమీక్షిస్తోందని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఐటీ చట్టం 2000లోని సేఫ్ హార్బర్ సూత్రం ప్రకారం ఇంటర్నెట్ లోని మధ్య వర్తులు మూడవ పక్షాలు తమ వెబ్ సైట్ లో పోస్ట్ చేసే వాటికి బాధ్యత వహించదు.
కాగా ఇప్పుడు డిజిటల్ చట్టాల సవరణలో భాగంగా కేంద్రం ఈ సూత్రాన్ని పునః పరిశీలిస్తోందని ఎలక్ట్రానిక్స్ , ఐటీ శాఖ సహాయ మంత్రి చంద్రశేఖర్ బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో వెల్లడించారు. 2021లో కేంద్రం ఇన్ఫర్మేషన్ టెక్నాలజజీ (మధ్య వర్తి మార్గదర్శకాలు , డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ ) రూల్స్ తీసుకు వచ్చింది.
ఇది సర్కార్ ద్వారా పోస్ట్ లను తొలగించమని కోరినప్పుడు లేదా చట్టం కోరినప్పుడు ప్లాట్ ఫారమ్ లు తీసి వేయాల్సి ఉంటుంది. హాని కలిగించే వాటిని తొలగించేందుకు వీలు కుదురుతుందని తెలిపారు ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్(Rajeev Chandrasekhar Digital India).
Also Read : వేదాంత పటేల్ కు అరుదైన గౌరవం