MLC Kavitha Deeksha : మహిళా బిల్లు కోసం పోరాటం – కవిత
ఢిల్లీ దీక్షలో పాల్గొన్న సీతారాం ఏచూరి
MLC Kavitha Delhi Deeksha : అన్ని రంగాలలో కీలకమైన పాత్ర పోషిస్తున్న మహిళలకు రిజర్వేషన్ కల్పించక పోవడం దారుణమన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష(MLC Kavitha Delhi Deeksha) చేపట్టారు. ఈ దీక్షను భారత జాగృతి సంస్థ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ దీక్షను సీపీఎం సీనియర్ నాయకుడు సీతారాం ఏచూరి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని, వారికి రిజర్వేషన్ తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. దీక్ష చేపట్టినందుకు ఎమ్మెల్సీ కవితను అభినందిస్తున్నట్లు తెలిపారు.
ఈ దీక్షకు దేశంలోని పలు పార్టీలకు చెందిన నాయకులు మద్దతు పలికారు. వివిధ సంఘాల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ప్రాణాలు పోసే మహిళలకు సరైన స్థానం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు సత్యవతి రాథోడ్. అంతకు ముందు ఎమ్మెల్సీ కవిత కీలక ప్రసంగం చేశారు.
2014, 2018లలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. 2024లో లోక్ సభ ఎన్నికలు రాబోతున్నా ఇప్పటికీ మహిళల గురించి పట్టించు కోవడం లేదని ఆవేదన చెందారు.
తాము ముందు నుంచీ మహిళా బిల్లు పెట్టాలని కోరుతున్నామని స్పష్టం చేశారు. 2010లో బిల్లు ఆమోదం పొందినా నేటి వరకు లోక్ సభలో ఆమోదం పొందక పోవడం దారుణమని పేర్కొన్నారు. తమ సర్కార్ మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha).
Also Read : అవాస్తవాలు అన్నీ అబద్దాలు – కిషన్ రెడ్డి