Actor Naresh Pavitra Marriage : ఒక్కటైన ‘నరేష్ పవిత్ర’
పెళ్లి వీడియో నెట్టింట్లో హల్ చల్
Actor Naresh Pavitra Marriage : అంతా ఊహించినట్టే సీనియర్ నటుడు, దివంగత కృష్ణ తనయుడు వీకే నరేష్ ఓ ఇంటి వాడయ్యాడు. ఆయన గత కొంత కాలంగా మరో సీనియర్ నటి పవిత్రతో ప్రేమలో పడ్డారు. వాలంటైన్స్ డే రోజు కూడా ముద్దు పెట్టుకునే ఫోటోలను కూడా షేర్ చేశారు. అవి హల్ చల్ చేశాయి. తాజాగా కొందరి సమక్షంలో యాక్టర్ నరేష్, పవిత్రతో కలిసి పెళ్లి(Actor Naresh Pavitra Marriage) చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో షేర్ చేశారు. ఇది వైరల్ గా మారింది.
స్వతహాగా నటుడు నరేష్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఒక పవిత్ర బంధం, రెండు మనస్సులు..మూడు ముళ్లు..ఏడడుగులు..మీ ఆశీస్సులు కావాలని కోరుకుంటూ అని పేర్కొన్నారు. నరేష్ , పవిత్ర కలిసి చేసుకున్ని పెళ్లి గురించి చెప్పకనే చెప్పారు. కొంత కాలం నుంచి వీరిద్దరూ కలిసి సహ జీవనం చేస్తున్నారు. ఇక లిప్ కిస్ సెన్సేషన్ గా మారింది అప్పట్లో.
నరేష్ ..పవిత్ర లోకేష్ ప్రేమ వ్యవహారం ప్రతి రోజూ చర్చకు దారి తీసింది. ప్రేమలో పడ్డారని, త్వరలోనే ఒక్కటి కాబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. గతంలో నరేష్ , పవిత్ర బెంగళూరులోని హోటల్ గదిలో ఉండగా మాజీ భార్య రమ్య రఘుపతి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. మీడియాలో హాట్ టాపిక్ గా చర్చకు దారి తీసింది. దీనిపై నటుడు సీరియస్ గా స్పందించారు. చివరకు ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకోవడం పై ఇంకా మాజీ భార్య స్పందించ లేదు.
Also Read : గర్వపడాలే తప్పా విమర్శిస్తారా