Mahua Moitra Adani : అదానీ రోడ్ షోల‌పై మ‌హూవా సెటైర్

హిండెన్ బ‌ర్గ్ నివేదికకు స‌మాధానం చెప్పు

Mahua Moitra Adani : టీఎంసీ ఎంపీ మ‌హూవా మోయిత్రా నిప్పులు చెరిగారు. ఆమె మ‌రోసారి అదానీ గ్రూప్ చైర్మ‌న్ గౌతమ్ అదానీపై మండిప‌డ్డారు. ఓ వైపు అమెరికా రీసెర్స్ గ్రూప్ హిండెన్ బ‌ర్గ్ స‌మ‌ర్పించిన నివేదిక‌కు స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. లేవ‌దీసిన ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబులు ఇవ్వ‌కుండా త‌న గ్రూప్ ను ప్ర‌మోట్ ఎలా చేసుకుంటారంటూ ప్ర‌శ్నించింది మ‌హూవా మోయిత్రా(Mahua Moitra Adani) . 

ఇదిలా ఉండ‌గా అదానీ గ్రూప్ సంస్థ‌లు దుబాయ్ , లండ‌న్ , యుఎస్ లోని అనేక న‌గ‌రాల‌లో రోడ్ షోలు నిర్వ‌హించ‌డాన్ని ఆమె తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ఇదంతా ప్ర‌చారంలో ఒక భాగ‌మేన‌ని పేర్కొన్నారు ఎంపీ. ఇక్క‌డ బ్యాంకుల‌లో రుణాలు తీసుకుని ఎలా వ్యాపారాలు చేస్తారంటూ నిల‌దీసింది . వాస్త‌వాలు బ‌య‌ట‌కు రాకుండా మ్యానేజ్ చేయ‌డంలో అదానీ ఆరి తేరారంటూ ఆరోపించింది మ‌హూవా మోయిత్రా. 

స్టాక్ మాన్యుపులేష‌న్ కు పాల్ప‌డిన‌ట్లు ఆధారాల‌తో స‌హా రిపోర్టు వెల్ల‌డించింద‌ని కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇవ్వ‌లేక పోయార‌ని ఎందుక‌ని అటూ మండి ప‌డింది టీఎంసీ ఎంపీ(Mahua Moitra).

ఇంకెంత కాలం ఇలా దేశాన్ని, ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తారంటూ ఫైర్ అయ్యింది. ఇదిలా ఉండ‌గా హిండెన్ బ‌ర్గ్ కొట్టిన దెబ్బ‌కు అదానీ గ్రూప్ దాదాపు $127 బిలియ‌న్లు న‌ష్ట పోయింది. ఒక ర‌కంగా అదానీకి కోలుకోలేని దెబ్బ‌. ప్ర‌పంచ కుబేరుల్లో మూడో స్థానంలో ఉన్న అదానీ ఉన్న‌ట్టుండి 22వ స్థానానికి పడి పోయాడు.

Also Read : మ‌హిళ‌ల స‌హ‌కారం దేశాభివృద్ధికి సోపానం

Leave A Reply

Your Email Id will not be published!