Rajinikanth : వెంకయ్య‌పై త‌లైవా షాకింగ్ కామెంట్స్

కేంద్ర మంత్రిగా ఉంటే బావుండేది

Rajinikanth Venkaiah Naidu : త‌మిళ సినీ స్టార్ ర‌జ‌నీకాంత్ షాకింగ్ కామెంట్స్ చేశారు మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య నాయుడిపై. వెంక‌య్య నాయుడికి అపార‌మైన అనుభ‌వం ఉంద‌ని , కానీ ఆయ‌న ఉప రాష్ట్ర‌ప‌తిని చేయ‌డం త‌న‌కు న‌చ్చ లేద‌న్నారు. ప్ర‌స్తుతం త‌లైవా చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఎందుక‌ని పార్టీ ఈ నిర్ణ‌యం తీసుకుందో త‌న‌కు అర్థం కాలేద‌ని చెప్పారు.

ఇంకొన్నేళ్ల పాటు కేంద్ర మంత్రిగా వెంక‌య్య నాయుడు కొన‌సాగి ఉండి ఉంటే బావుండేద‌న్నారు. రాజ‌కీయంగా అపార‌మైన అనుభ‌వం క‌లిగిన ఆయ‌న‌ను రాజ‌కీయాల నుంచి దూరం చేయ‌డం త‌న‌ను విస్తు పోయేలా చేసింద‌న్నారు ర‌జ‌నీకాంత్(Rajinikanth Venkaiah Naidu). ప్ర‌స్తుతం త‌లైవా చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఉప రాష్ట్ర‌ప‌తి హోదాలో ఉన్నా ఒక‌లే లేకున్నా ఒక‌టేన‌ని పేర్కొన్నారు.

చెన్నై లోని మ్యూజిక్ అకాడ‌మీలో జ‌రిగిన సేఫియ‌న్స్ హెల్త్ ఫౌండేష‌న్ ఉత్స‌వాల్లో ర‌జ‌నీకాంత్ తో పాటు మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య నాయుడు పాల్గొన్నారు. ఒక ర‌కంగా పాలిటిక్స్ కు దూరంగా ఉండ‌డం అనేది త‌గ‌ద‌న్నారు. దీని వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు సేవ చేసే ఛాన్స్ కోల్పోవ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఇప్ప‌టికైన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ వెంక‌య్య నాయుడు విష‌యంలో ఆలోచించాల‌ని సూచించారు.

కింది స్థాయి నుంచి కేంద్ర స్థాయి దాకా ఎద‌గ‌డం మామూలు విష‌యం కాద‌న్నారు. ఈ సంద‌ర్భంగా ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు ప్ర‌సంగిస్తూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు ర‌జ‌నీకాంత్(Rajinikanth) గురించి. త‌ను ఉన్న సినీ రంగం నుంచి రాజ‌కీయాల్లోకి రావ‌ద్ద‌ని ఆనాడు తాను సూచించాన‌ని చెప్పారు.

Also Read : బ‌లగం బృందానికి ‘మెగా’ ప్ర‌శంస‌

Leave A Reply

Your Email Id will not be published!