Ram Charan Priyanka : చెర్రీ ఫ్యామిలీకి ప్రియాంక ఆతిథ్యం
లాస్ ఏంజిల్స్ ఇంట్లో విడిది
Ram Charan Priyanka : నటుడు రామ్ చరణ్ తన భార్య ఉపాసన తో కలిసి హల్ చల్ చేశారు. ప్రముఖ బాలీవుడ్, హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ప్రస్తుతం లాస్ ఏంజిల్స్ నగరంలో కొలువు తీరారు. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, నటులు రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ , మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, గాయకులు రాహుల్ సిప్లీ గంజ్ , కాల భైరవ , రచయిత చంద్రబోస్ ఇప్పటికే చేరుకున్నారు.
ఇదిలా ఉండగా రామ్ చరణ్ హల్ చల్ చేస్తున్నారు. ఆయన మెగా ఫ్యాన్స్ తో భేటీ అయ్యారు. వారితో ముచ్చటించారు. ఇదిలా ఉండగా తన భార్య ఉపాసనతో కలిసి ప్రియాంక చోప్రా నివాసానికి చేరుకున్నారు. భర్త, తల్లితో కలిసి ఫోటోలు దిగారు చెర్రి, ఉపాసన. వీరితో పాటు తల్లి మధు చోప్రా, ప్రియాంక భర్త డెనిస్ పాల్ కెవిన్ జోనాస్ కూడా ఉన్నారు.
ప్రస్తుతం ఉపాసన కొణిదెల హాట్ టాపిక్ గా మారారు. ప్రస్తుతం గర్భవతిగా ఉన్నారు చెర్రీ. ఇక గ్లోబల్ నటి ప్రియాంక చోప్రా(Ram Charan Priyanka) రామ్ చరణ్ ఫ్యామిలీకి ఆతిథ్యం ఇచ్చింది. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ మూవీని అభినందించింది. ప్రియాంక చోప్రా, ఉపాసన తెల్లటి దుస్తులు ధరించారు. రామ్ చరణ్ నీలి రంగు చొక్కా, తెల్లటి ప్యాంట్ వేసుకున్నాడు.
ఇదిలా ఉండగా రామ్ చరణ్ తో కలిసి నటించారు ప్రియాంక చోప్రా. జంజీర్ హిందీ మూవీలో చెర్రీతో కలిసి పని చేసిన సందర్భాన్ని గుర్తు చేశారు.
Also Read : ఎన్టీఆర్ జక్కన్న హల్ చల్