Kartiki Gonsalves Oscar : అద్భుతం ‘ఆమె’కు దక్కిన గౌరవం
ది ఎలిఫెంట్ విస్పెరర్స్ కార్తికి గోన్సాల్వ్స్
Kartiki Gonsalves Oscar : యావత్ ప్రపంచం ఆమె తీసిన డాక్యుమెంటరీ షార్ట్ ను చూసి విస్తు పోయింది. ఓ వైపు ఎక్కడా ప్రచారానికి నోచుకోలేదు. హంగు ఆర్భాటం లేకుండా అత్యున్నతమైనదిగా భావించే ఆస్కార్ అవార్డు 2023 సంవత్సరానికి గాను ఎంపికైంది ది ఎలిఫెంట్ విస్పెరర్స్. ప్రతిదీ వ్యాపారమయంగా మారిన ప్రస్తుత తరుణంలో ప్రకృతి, జంతువులు..మనుషుల మధ్య ఎలాంటి బంధం కలిగి ఉండాలో చెప్పే ప్రయత్నం చేసింది దర్శకురాలు కార్తికి గోన్సాల్వ్స్(Kartiki Gonsalves Oscar) .
గత ఏడాది 2022 డిసెంబర్ లో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆదరణ చూరగొంది. ఇదే సమయంలో ఎవరూ ఊహించ లేదు ది ఎలిఫెంట్ విస్పెరర్స్ కు ఆస్కార్ దక్కుతందని. దీనిని మహిళనే నిర్మించడం విశేషం. దర్శక, నిర్మాతలు ఇద్దరూ కలిసి ది ఎలిఫెంట్ విస్పరర్స్ కోసం ఆస్కార్ అవార్డును విశ్వ వేదికపై అందుకున్నారు. ఆనందం తట్టుకోలేక కన్నీటి పర్యంతం అయ్యారు. వీరు చేసిన శ్రమ ఫలించింది.
ఈ సందర్భంగా ఆస్కార్ అవార్డు అనంతరం దర్శకురాలు కార్తికి గోన్సాల్వ్స్(Kartiki Gonsalves Oscar) స్పందించారు. ప్రజలు ఏనుగులను అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తే ..వారు వాటిని ప్రేమించడం ప్రారంభిస్తారని పేర్కొన్నారు. కార్తికి గోన్సాల్వేస్ వృత్తి పరంగా ఫోటోగ్రాఫర్ . ఆసియా లో ఏనుగులు, దేశీయ కమ్యూనిటీల గురించి, సినిమా నిర్మాణం గురించి పరిశోధన చేస్తూ వచ్చారు.
చిన్నతనంలో నీలగిరిలో పెరిగారు. అరణ్యంలో తన పేరెంట్స్ తో కలిసి జీవించారు. 15 ఏళ్లప్పటి నుండి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఔత్సాహికురాలుగా ఉన్నారు.
Also Read : ది ఎలిఫెంట్ విస్పరర్స్ గ్రేట్