AAP Minister SP : ఒక్కటవనున్న పోలీస్ ఆఫీసర్..మంత్రి
జ్యోతి యాదవ్ తో హర్జోత్ సింగ్ పెళ్లి
AAP Minister SP : ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పంజాబ్ మంత్రి హర్జోత్ సింగ్ ఇంటి వాడయ్యాడు. సీనియర్ పోలీస్ ఆఫీసర్ గా పని చేస్తున్న జ్యోతి యాదవ్ ను వివాహం చేసుకోనున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వన్ రాబోయే రోజుల్లో జీవితాల్లో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించ బోతున్న హర్జోత్ బెయిన్స్ , జ్యోతి యాదవ్(AAP Minister SP) లను అభినందించారు.
ఈ జంట ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆప్ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ ఐపీఎస్ అధికారిణి జ్యోతి యాదవ్ తో ఈ నెలాఖరులో వివాహం చేసుకోనున్నారు. రూప్ నగర్ జిల్లా లోని ఆనంద్ పూర్ సాహిబ్ నియోజకవర్గం నుండి మొదటిసారిగా ఎన్నికయ్యారు బైన్స్. ప్రస్తుతం పంజాబ్ సీఎం ప్రభుత్వం లో విద్యా శాఖ మంత్రిగా ఉన్నారు.
ఇదిలా ఉండగా హోర్జోత్ సింగ్ బైన్స్ వృత్తి రీత్యా న్యాయవాది. ఆయనకు 32 ఏళ్లు. ఆనంద్ పూర్ సాహిబ్ లోని గంభీర్ పూర్ గ్రామానికి చెందిన వారు. 2017 ఎన్నికల్లో స్నాహేవాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడి పోయారు. గతంలో ఆయన ఆప్ యువజన విభాగానికి చీఫ్ గా ఉన్నారు.
2014లో చండీగఢ్ లోని పంజాబ్ విశ్వ విద్యాలయం నుండి బీఏ, ఎల్ఎల్బీ ఆనర్స్ చేశాడు. 2018లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి అంతర్జాతీయ మానవ హక్కుల చట్టంలో సర్టిఫికెట్ పొందాడు. పంజాబ్ తో కేడర్ ఐపీఎస్ అయిన యాదవ్ మాన్సా జిల్లాలో ఎస్పీగా ఉన్నారు.
Also Read : కేంద్రం వైఫల్యాలపై నిలదీయాలి – సోనియా