TSPSC Paper Leak : పేపర్ లీకులు ఫలితాలపై నీలి నీడలు
ఆది నుంచి టీఎస్పీఎస్సీ పై అనుమానాలు
TSPSC Paper Leak Issue : కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రహసనంగా మారింది. స్కాంలు, కేసులు , ఆత్మహత్యలు, ఆందోళనలకు నెలవుగా మారింది.
ఓ వైపు పక్కనే ఉన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ అత్యంత పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తూ వస్తోంది. అంతే కాదు ఇప్పటికే ఇయర్ క్యాలెండర్ ను కూడా ప్రకటించింది. అక్కడ ఉన్న సీఎం జగన్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కానీ తెలంగాణ వరకు వచ్చేసరికల్లా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) తీవ్ర విమర్శలకు గురవుతోంది.
రాజకీయ నాయకులకు వేదికగా మారిందన్న ఆరోపణలు లేక పోలేదు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత న్యాయం జరుగుతుందని భావించారు. ఆనాడు ఘంటా చక్రపాణిని చైర్మన్ గా నియమించినా పరీక్ష సరిగా నిర్వహించ లేదన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఒకే ప్రాంతానికి చెందిన వారికి జాబ్స్ వచ్చాయని నిరుద్యోగులు విమర్శలు గుప్పించారు.
ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లవుతున్నా నేటికీ ఏ ఒక్క పరీక్ష సరిగా నిర్వహించిన పాపాన పోలేదు. అభ్యర్థుల ఎంపిక వ్యవహారం అత్యంత తలనొప్పిగా మారింది.
ఇదే సమయంలో ప్రతి ఇంటికో ఉద్యోగం అని చెప్పిన సీఎం ఆ తర్వాత ఎన్నికలకు ముందు జాబ్స్ నోటిఫికేషన్స్ కు తెర తీశారు. జాబ్స్ ప్రక్రియకు రిజర్వేషన్ల ప్రక్రియ, కోర్టుల్లో కేసులు ఇలా ప్రతి దానికి అడ్డంకిగా మారింది.
ఇదే క్రమంలో దేశంలో కొలువు తీరిన యునియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపీఎస్ సీ ) ప్రతి ఏటా అత్యంత పారదర్శకతతో భర్తీ చేస్తూ వస్తోంది. కానీ మన దాకా వచ్చే సరికి నిర్వహణ లోపం కనిపిస్తోంది. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ జనార్దన్ రెడ్డిని చైర్మన్ గా నియమించారు సీఎం.
కానీ గ్రూప్ 1 పరీక్ష ప్రిలిమినరీ కి సంబంధించి లేటుగా పేపర్ ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. ఇదే సమయంలో కొన్ని పరీక్షలు నిర్వహించడం..అంత లోనే టీఎస్పీఎస్సీలో పేపర్ లీక్(TSPSC Paper Leak Issue) అయిందని కార్యాలయం నుంచే ఫిర్యాదు అందడం విస్తు పోయేలా చేసింది.
లక్షలాది మంది నిరుద్యోగులంతా జాబ్స్ భర్తీపై ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలపై టీఎస్పీస్సీ చైర్మన్ నీళ్లు చల్లారు. ఇక ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలు రావని డిసైడ్ అయ్యారు నిరుద్యోగులు.
Also Read : పేపర్ లీకేజీ బాధ్యత జనార్దన్ రెడ్డిదే