JR NTR Grand Welcome : ఎన్టీఆర్ కు గ్రాండ్ వెల్ క‌మ్

అమెరికా నుంచి స్వ‌దేశానికి

JR NTR Grand Welcome : ద‌ర్శ‌క ధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన జూనియ‌ర్ ఎన్టీఆర్ (JR NTR Grand Welcome) అమెరికా నుంచి స్వ‌దేశానికి తిరిగి వ‌చ్చారు. ఆయ‌న ఆస్కార్ అవార్డు ఫంక్ష‌న్ లో పాల్గొన్నారు. చంద్ర‌బోస్ రాసిన పాట నాటు నాటు సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీనికి ఎంఎం కీర‌వాణి సంగీతం అందించ‌గా రాహుల్ సిప్లిగంజ్ , కాల భైర‌వ పాడారు.

ఈ పాటను ఉక్రెయిన్ లో రూ. 20 కోట్లు పెట్టి తీశారు. ఇక అద్భుతంగా వ‌చ్చిన నాటు నాటు పాట‌లో జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టించారు. అంతే కాదు బాలీవుడ్ న‌టులు ఆలియా భ‌ట్ , అజ‌య్ దేవ‌గ‌న్ కూడా ఆర్ఆర్ఆర్ లో కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

మూవీని డీవీవీ దాన‌య్య నిర్మించారు. కానీ ఆస్కార్ అవార్డుల పుర‌స్కారంలో ఎక్క‌డా క‌నిపించ లేదు. కేవ‌లం రామ్ చ‌ర‌ణ్ , ఆయ‌న భార్య ఉపాస‌న‌, ఎస్ ఎస్ రాజ‌మౌళి, భార్య ర‌మా రాజ‌మౌళి, జూనియ‌ర్ ఎన్టీఆర్ , రాహుల్ సిప్లిగంజ్ , కాల భైర‌వ‌తో పాటు కార్తికేయ ఉన్నారు. ఇక కార్తికేయ ఈ మొత్తం అవార్డు రావడానికి కృషి చేశార‌ని అవార్డు వేదిక‌పై సంగీత ద‌ర్శ‌కుడు ఎంఎం కీర‌వాణి ప్ర‌క‌టించారు.

ఇదిలా ఉండ‌గా ఆస్కార్ అవార్డుల సంద‌ర్భంగా ఆర్ఆర్ఆర్ కు ప్ర‌మోష‌న్ చేయడంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు జూనియ‌ర్ ఎన్టీఆర్. బెస్ట్ ఒరిజిన‌ల్ కేట‌గిరీ లో నాటు నాటు సాంగ్ ఎంపికైంది. ఆస్కార్ అవార్డుల అనంత‌రం తార‌క్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు అభిమానులు.

Also Read : బంధం భావోద్వేగాల స‌మ్మేళ‌నం

Leave A Reply

Your Email Id will not be published!