MLC Kavitha Pillai : బుచ్చిబాబు..పిళ్లై..క‌వితపై ఈడీ ఫోక‌స్

ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో కీల‌క మ‌లుపు

MLC Kavitha Pillai ED : ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లో రోజు రోజుకు కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్ప‌టికే సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ క‌విత కీల‌క పాత్ర పోషించిన‌ట్లు కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు సీబీఐ , ఈడీ ప్ర‌త్యేక కోర్టుకు స‌మ‌ర్పించిన ఛార్జ్ షీట్ లోపేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం 34 మందిపై సీబీఐ అభియోగాలు మోపింది. ఇందులో మ‌నీ లాండ‌రింగ్ జ‌రిగింద‌ని స్ప‌ష్టం చేయ‌డంతో ఈడీ రంగంలోకి దిగింది.

హైద‌రాబాద్ లో క‌విత ను ఆమె ఇంట్లో విచార‌ణ జ‌రిపారు. మార్చి 11న ఈడీ ముందుకు రావాల‌ని నోటీసు ఇచ్చింది. 9 గంట‌ల పాటు ఎమ్మెల్సీ క‌విత‌ను ఈడీ విచారించింది. మ‌రోసారి రావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేసింది. మార్చి 16న తిరిగి రావాల‌ని స్ప‌ష్టం చేసింది.

విచార‌ణ‌లో భాగంగా సూత్ర‌ధారులుగా ఉన్నారంటూ క‌విత ఆడిట‌ర్ గోరంట్ల బుచ్చిబాబుతో పాటు లిక్క‌ర్ వ్యాపార‌వేత్త అరుణ్ రామ‌చంద్ర పిళ్లైని క‌లిపి క‌విత‌తో(MLC Kavitha Pillai ED) విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు స‌మాచారం. ఇక ఆమెకు సంఘీభావం తెలిపేందుకు మంత్రులు శ్రీ‌నివాస్ గౌడ్ , ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, స‌త్య‌వ‌తి రాథోడ్ ఇవాళ చేరుకున్నారు.

నిన్ననే ఎమ్మెల్సీ క‌విత ఢిల్లీకి చేరుకున్నారు. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లుపై రౌండ్ టేబుల్ స‌మావేశం చేప‌ట్టారు క‌విత‌. ఇందులో 12 పార్టీల ప్ర‌తినిధులు పాల్గొన్నారు. ఈ మొత్తం వ్య‌వహారంపై మంత్రులు మాట్లాడారు. ఇదంతా కావాల‌ని కేంద్రం త‌మ నాయ‌కురాలిని ఇరికించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇదిలా ఉండ‌గా ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు, ధ‌ర్నాలు, ర్యాలీలు చేప‌ట్టేందుకు వీలు లేద‌ని ఢిల్లీ పోలీస్ ప్ర‌క‌టించింది.

Also Read : ఢిల్లీ ఈడీ వ‌ద్ద ఉద్రిక్త‌త భారీ భ‌ద్ర‌త‌

Leave A Reply

Your Email Id will not be published!