Amit Shah : అమిత్ షా నోట ఇందిరా గాంధీ మాట
రాహుల్ కామెంట్స్ పై కేంద్ర మంత్రి
Amit Shah Rahul Row : కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా తీవ్రంగా స్పందించారు. రాహుల్ గాంధీ గత కొంత కాలం నుంచి భారత దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే లండన్ లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ నిరాధార ఆరోపణలు చేశారంటూ పేర్కొన్నారు. ఇదే సమయంలో తన నాయినమ్మ, మాజీ ప్రధాన మంత్రి దివంగత ఇందిరా గాంధీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
మాజీ ప్రధాని కూడా విదేశీ దేశంలో స్వదేశీ రాజకీయాలపై చర్చించేందుకు నిరాకరించారని స్పష్టం చేశారు అమిత్ షా(Amit Shah Rahul Row). ప్రతిపక్షాలు చర్చలు జరిపేంందుకు ముందుకు వస్తే తాము రెడీగా ఉన్నామని అన్నారు కేంద్ర మంత్రి. ప్రభుత్వం స్నేహ పూర్వక వాతావరణంతో వెళుతోందన్నారు. కానీ కావాలని ప్రతిపక్షాలు తాత్సారం చేస్తున్నాయంటూ మండిపడ్డారు. ఓ వైపు చర్చలకు రమ్మని ఆహ్వానిస్తున్నా వారు ఒప్పుకోవడం లేదు.
దీని అర్థం ఏమిటంటే వారికి ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం లేదని తేలి పోయిందన్నారు. ఢిల్లీలో జరిగిన ఓ జాతీయ మీడియా ఛానల్ తో జరిగిన చర్చల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah). స్పీకర్ వద్దకు రావాలి. ఓ అడుగు మీరు వేస్తే రెండడుగులు కేంద్ర సర్కార్ వేస్తుందని మరోసారి వెల్లడించారు. పార్లమెంటరీ వ్యవస్థ కేవలం ఖజానాతో లేదా ప్రతిపక్షంతో మాత్రమే నడవదన్నారు కేంద్రమంత్రి.
మేం చొరవ తీసుకున్నా ప్రతిపక్షాల నుంచి చర్చల ప్రతిపాదన రాలేదన్నారు. ఇక ఎవరితో మాట్లాడాలి. వాళ్లు కేంద్రంతో మాట్లాడటం లేదు కేవలం మీడియాతో మాట్లాడితే సమస్య పరిష్కారం కాదన్నారు.
Also Read : అఖిలేష్ దీదీ కొత్త ఫ్రంట్