Najam Sethi BCCI : బీసీసీఐ అత్యంత శక్తివంతమైంది
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ నజామ్ సేథీ
Najam Sethi BCCI : పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ నజామ్ సేథీ(Najam Sethi) సంచలన కామెంట్స్ చేశారు. ఆసియా కప్ ను నిర్వహించేందుకు పాకిస్తాన్ కు ఛాన్స్ ఇవ్వాలంటే ఇతర సభ్యులు జోక్యం చేసుకోవాలని కోరారు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో అత్యంత శక్తివంతమైన క్రీడా సంస్థ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అని సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం బీసీసీఐకి వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదన్నారు.
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) లో ఎన్ని క్రీడా సంస్థలు ఉన్నా బీసీసీఐదే ఆధిపత్యం అని స్పష్టం చేశారు. ఆసియా కప్ ను పాకిస్తాన్ నిర్వహించాల్సి ఉంది ఈ ఏడాదిలో. ఇదే సంవత్సరంలో బీసీసీఐ ఆధ్వర్యంలో వన్డే వరల్డ్ కప్ నిర్వహించాలి. అయితే ఇప్పటికే పీసీబీకి బీసీసీఐకి మధ్య మాటల యుద్దం నడిచింది.
ఒక వేళ భారత జట్టు పాకిస్తాన్ నిర్వహించే ఆసియా కప్ లో ఆడక పోతే తమ జట్టు భారత్ లో నిర్వహించే వన్డే వరల్డ్ కప్ లో పాల్గొనదని కుండ బద్దలు కొట్టారు. దీనిని లైట్ గా తీసుకుంది బీసీసీఐ. తాము ఆడే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. భారత , పాకిస్తాన్ దేశాల మధ్య భద్రతా సమస్యలు ఉన్నాయని, తమకు ఆట కంటే ఆటగాళ్ల భద్రత ముఖ్యమని అందుకే తమ జట్టు పాకిస్తాన్ కు వెళ్లదని బీసీసీఐ కార్యదర్శి , ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ జే షా ప్రకటించారు.
దీంతో ఏసీసీ ఆధ్వర్యంలో దుబాయ్ లో కీలక మీటింగ్ జరిగింది. తటస్థ వేదికపై ఆడేందుకు సిద్దమేనని కానీ పాకిస్తాన్ లో కుదరని తేల్చి చెప్పారు షా. ఈ తరుణంలో నజామ్ సేథీ ఏసీసీలో ఇతర సభ్యులు ఆసియా కప్ లో పాల్గొనేలా సూచించాలని నజామ్ సేథీ(Najam Sethi BCCI) కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read : సోఫీ డివైన్ సెన్సేషన్ ఇన్నింగ్స్