ED MLC Kavitha : రానన్న కవిత కుదరదన్న ఈడీ
సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్
ED Orders Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కోలుకోలేని షాక్ ఇచ్చింది కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ(ED). తాను రాలేనని, ఈడీ తనను టార్చర్ చేస్తోందని, థర్డ్ డిగ్రీ ప్రయోగం చేసిందంటూ భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానంను ఆశ్రయించింది కవిత.
పిటిషన్ లో కీలక వ్యాఖ్యలతో పాటు సంచలన ఆరోపణలు చేసింది. సీబీఐ హైదరాబాద్ లోని తన ఇంట్లో విచారణ చేపట్టింది. ఆ తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మనీ లాండరింగ్ వ్యవహారం చోటు చేసుకుందని తేల్చింది ఈడీ.
మొదటగా ఎమ్మెల్సీ కవితకు చెందిన ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబుతో పాటు వ్యాపారవేత్త అరుణ్ రామచంద్రన్ పిళ్లైని అరెస్ట్ చేసింది. ఇదే సమయంలో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీస్ సిసోడియాను అదుపులోకి తీసుకుంది. తీహార్ జైలుకు తరలించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడితో పాటు ఎంపీకి కూడా ఈడీ నోటీసు ఇచ్చింది. ఇప్పటికే ఈడీ విచారణకు హాజరు కావాల్సిందిగా ఎమ్మెల్సీ కవితకు నోటీసు జారీ చేసింది. మార్చి 11న 9 గంటల పాటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విచారించింది.
విచారణ ముగిసిన వెంటనే మార్చి 16న హాజరు కావాలని నోటీసు ఇచ్చింది. కానీ కవిత తాను రాలేనంటూ డుమ్మా కొట్టింది. తనను విచారించకుండా ఈడీని ఆదేశించాలని, స్టే ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది కవిత. విచారణ చేపట్టిన ధర్మాసనం కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఎట్టి పరిస్థితులలో హాజరు కావాల్సిందేనంటూ స్పష్టం చేసింది. దీంతో కవిత మరోసారి స్కిప్ అయ్యే ఛాన్స్ (ED Orders Kavitha) ఉందని గ్రహించింది ఈడీ. ఈ మేరకు ఆమెకు ఎలాంటి స్టే ఇవ్వకుండా ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టుల కేవియట్ దాఖలు చేసింది.
Also Read : అందరి చూపు కల్వకుంట్ల కవిత వైపు