Supreme Court : న్యాయవాదిపై సుప్రీం సీరియస్
సీజేఐని ప్రతివాదిగా ఎలా చేరుస్తారు
Supreme Court Slams : సీనియర్ న్యాయవాదిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్ లో ప్రధాన న్యాయమూర్తి ని ప్రతిపాదిని చేసినందుకు చురకలు అంటించింది(Supreme Court Slams). అత్యున్నత న్యాయ స్థానానికి సంబంధించి ఇలాంటి వాటిని అంగీకరించ బోమంటూ బెంచ్ ధర్మాసనం స్పష్టం చేసింది. మీరు ప్రతివాదుల సంఖ్య రెండు , మూడులను పార్టీలుగా ఎలా ప్రయోగించలరంటూ ప్రశ్నించింది.
న్యాయవాదులను సీనియర్ న్యాయవాదులుగా నియమించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైంది పిటిషన్. దీనిపై సోమవారం విచారణ చేపట్టింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ ను ప్రతివాదులలో ఒకరిగా చేర్చడాన్ని మినహాయింపు ఇచ్చింది.
జస్టిస్ ఎస్కే కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం సెక్రటరీ జనరల్ ద్వారా భారత ప్రధాన న్యాయమూర్తిని , అత్యున్నత న్యాయ స్థానాన్ని ఎలా ఏర్పాటు చేశారంటూ ఇతరులతో పాటు పిటిషన్ దాఖలు చేసిన సీనియర్ న్యాయవాది మాథ్యూస్ జె. నెదుంపరను ప్రశ్నించింది. పార్టీల శ్రేణిని చూడండి. మరు 40 ఏళ్ల అనుభవం ఉ్న న్యాయావాది. మీరు ప్రతివాది నంబర్ టూ సీజేఐ, మూడు పూర్తి కోర్టులను పార్టీలుగా ఎలా ఇంప్లీడ్ చేస్తారంటూ ప్రశ్నించింది ధర్మాసనం.
మీరు మొదట పార్టీల మెమోను సవరించండి అని సూచించింది ఎస్కే కౌల్ , జస్టిస్ అమానుల్లా, జస్టిస్ అరవింద్ కుమార్ తో కూడిన బెంచ్ . రిజిస్ట్రార్ ద్వారా పార్టీగా సుప్రీంకోర్టును అభిశంసించ వచ్చని , పార్టీల మెమోను సవరించాలని కోరిందని , ఆ తర్వాతే పిటిషన్ ను విచారణకు జాబితా చేస్తామని స్పష్టం చేసింది ధర్మాసనం. ధర్మాసనం చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Also Read : సీల్డ్ కవర్ వ్యాపారం ముగించండి – సీజేఐ