Mamata Banerjee Rahul : రాహుల్ గాంధీ మోదీకి బిగ్ టీఆర్పీ

మ‌మ‌తా బెన‌ర్జీ షాకింగ్ కామెంట్స్

Mamata Banerjee Rahul : టీఎంసీ చీఫ్, ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ షాకింగ్ కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీపై గ‌త కొంత కాలంగా టార్గెట్ చేస్తూ వ‌చ్చారు. సోమ‌వారం దీదీ మీడియాతో మాట్లాడారు. రాహుల్ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి అతి పెద్ద టీఆర్పీ అని ఎద్దేవా చేశారు.

రాహుల్ ను హీరోగా నిల‌బెట్టాల‌ని భార‌తీయ జ‌న‌తా పార్టీ ఉవ్విళ్లూరుతోందని మ‌మ‌తా బెన‌ర్జీ(Mamata Banerjee Rahul). పార్టీ అంత‌ర్గ‌త స‌మావేశంలో రాహుల్ గాంధీపై తీవ్ర ప‌ద జాలంతో దాడి చేశారు సీఎం. అందుకే పార్ల‌మెంట్ ను న‌డ‌ప నీయ‌డం లేద‌న్నారు. కోల్ క‌తా నుండి వ‌ర్చువ‌ల్ గా ముర్షిదాబాద్ లోని పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో మాట్లాడారు. 

ఇటీవ‌ల ముగిసిన ఉప ఎన్నిక‌ల్లో తృణ‌మూల్ కాంగ్రెస్ కు మైనార్టీ ప్రాబ‌ల్యం ఉన్న సీటును కోల్పోయింది. అంత‌కు ముందు తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీ , లోక్ స‌భ‌లో ఆ పార్టీ నాయ‌కుడు సుదీప్ బందోపాధ్యాయ మాట్లాడారు. రాహుల్ గాంధీ ప్ర‌తిప‌క్ష ముఖంగా ఉండ‌టం వ‌ల్ల బీజేపీకి ప్ర‌యోజ‌నం చేకూరుతుంద‌ని సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

గ‌త కొన్నేళ్లు గా బెన‌ర్జీ(Mamata Banerjee) కాంగ్రెస్ పార్టీతో ఢీకొంటున్నారు. ఇటీవల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పార్టీ పోటీ చేసిన బెంగాల్ , ఈశాన్య రాష్ట్రాల్లో తృణ‌మూల్ కాంగ్రెస్ త‌మ పార్టీకి చెందిన ఓట్ల‌ను చీల్చింద‌ని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక్క‌డ ఒక్క సీటు కూడా గెల‌వ‌లేక పోయింది. ఎన్నిక‌ల‌కు ముందు బెంగాల్ లో రాజ‌కీయ హింస , శార‌దా స్కామ్ ను ఉటంకిస్తూ టీఎంసీపై దాడి చేశారు కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజ‌న్ చౌద‌రి.

Also Read : కేంద్రానికి రైతున్న‌ల అల్టిమేటం

Leave A Reply

Your Email Id will not be published!