RS Praveen Kumar : సీబీఐతో విచారణ జరిపించాలి
బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్పీ డిమాండ్
RS Praveen Kumar : బహుజన్ సమాజ్ పార్టీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ నియామకంలో కేసీఆర్ ప్రభుత్వం తాత్సారం చేసిందని ఆరోపించారు. ఇదంతా డ్రామా అని పేర్కొన్నారు. పూర్తి పారదర్శకతతో ఉండాల్సిన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఇవాళ అక్రమాలకు, అవినీతికి, స్కాంలకు కేరాఫ్ గా మారడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్ఎస్పీ(RS Praveen Kumar).
సిట్ ను కాకుండా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సీబీఐతో విచారణ జరిపించాలని బీఎస్పీ స్టేట్ చీఫ్ డిమాండ్ చేశారు. ఇప్పుడున్న కమిషన్ చైర్మన్, సెక్రటరీ, సభ్యులను వెంటనే తొలగించాలని, వారిని ఎక్కడ కూడా నియమించకుండా చూడాలని కోరారు. వీరి నిర్వాకం వల్ల ఇవాళ లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ సీఎంఓ పాత్ర కూడా ఇందులో ఉందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ప్రతి ఒక్కరు స్పందించాలని, నేరుగా రాష్ట్రపతికి లేఖలు రాయాలంటూ పిలుపునిచ్చారు ఆర్ఎస్పీ. 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాయ మాటలు చెప్పారంటూ ఆరోపించారు.
రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదని ఆరోపించారు ఆర్ఎస్పీ. బిస్వాల్ కమిటీ చెప్పిన విధంగానైనా ఇప్పటి వరకు ఎన్ని పోస్టులు భర్తీ చేశారో చెప్పాలన్నారు. సీఎం అబద్దాలు తప్ప వాస్తవాలు మాట్లాడడం లేదని వాపోయారు.
Also Read : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై .. కేంద్రానికి కేటీఆర్ లేఖ