Bhutan King : భారత్ కు చేరుకున్న భూటాన్ రాజు
మూడు రోజుల పాటు పర్యటన
Bhutan King : భారత్ , భూటాన్ దేశాల మధ్య సత్ సంబంధాలు కొనసాగించేందుకు గాను భూటాన్ రాజు జిగ్మే వాంగ్ చుక్ ఇండియాలో పర్యటిస్తున్నారు. సోమవారం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఆయన మూడు రోజుల పాటు భారత్ లో ఉంటారు. ఇప్పటికే భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా కీలక అంశాలపై చర్చించనున్నారు. ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్లనున్నారు.
భూటాన్ రాజుతో పాటు ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ టాండీ దోర్జీ కూడా ఉన్నారు. గత కొన్నేళ్లుగా భూటాన్ , భారత్ దేశాలు పరస్పరం అవగాహన కలిగి ఉన్నాయి. అంతకు ముందు భారత దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తమ దేశంలో పర్యటించాల్సిందిగా భూటాన్ రాజు(Bhutan King) జిగ్మే వాంగ్ చుక్ ను ఆహ్వానించారు. రాష్ట్రపతి పిలుపు మేరకు మూడు రోజుల పాటు పర్యటించేందుకు ఇవాళ విచ్చేశారు .
అధికారిక పర్యటనలో భాగంగా భూటాన్ రాజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీని కలుసుకుంటారు. వీరితో పాటు భారత దేశ విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ , సీనియర్ అధికారులు సైతం భూటాన్ రాజుతో(Bhutan King) సమావేశం కానున్నారు.
భారత దేశం చాలా కాలంగా భూటాన్ అగ్ర శ్రేణి వాణిజ్య భాగస్వామిగా ఉంది. అక్కడ పెట్టుబడులకు ప్రధాన వనరుగా కొనసాగుతోంది. నవంబర్ 21లో భారత దేశంతో భూటాన్ ద్వైపాక్షిక , రవాణా వాణిజ్యం కోసం ఏడు కొత్త వాణిజ్య మార్గాలను ప్రారంభించనుంది.
Also Read : గుజరాత్ కోర్టుకు రాహుల్ గాంధీ