Venu Balagam : భ‌ద్ర‌కాళిని ద‌ర్శించుకున్న ‘బ‌ల‌గం’ వేణు

అమ్మ వారి దీవెన‌లే విజ‌యానికి కార‌ణం

Venu Balagam : దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో వేణు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన బ‌ల‌గం చిత్రం ఊహించ‌ని రీతిలో అపూర్వ‌మైన ఆద‌ర‌ణ చూర‌గొంటోంది. సినిమా విడుద‌లై నాటి నుంచి నేటి దాకా రికార్డుల‌ను తిర‌గ రాస్తోంది. అత్యంత లో బ‌డ్జెట్ తో తీసిన ఈ చిత్రం విచిత్రంగా కాసులు కురిపిస్తోంది. బాక్సులు నిండి పోయేలా చేస్తోంది. ద‌ర్శ‌కుడు తేజ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన చిత్రంలో చిన్న పాత్ర‌లో ఎంట్రీ ఇచ్చిన వేణు అంచెలంచెలుగా న‌టుడిగా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నాడు.

తెలంగాణ ప్రాంతానికి చెందిన ఈ వేణు(Venu Balagam) పేరు ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా మారు మ్రోగుతోంది. ప‌ల్లెటూరులోని కుటుంబాల్లో చోటు చేసుకునే భావోద్వేగాల‌ను తెర‌పై అద్భుతంగా ఆవిష్క‌రించిన ఘ‌న‌త వేణుకే ద‌క్కింది.

హాస్య న‌టుడిగా పేరు పొందిన వేణులో న‌టుడు మాత్ర‌మే కాదు అద్భుత‌మైన ర‌చ‌యిత కూడా దాగి ఉన్నాడు. దిల్ రాజు ప్రోత్సాహంతో తొలిసారి బ‌ల‌గం సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇందులోని పాత్ర‌లు కంట త‌డి పెట్టిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఇత‌ర ప్రాంతాల్లో కూడా బ‌ల‌గంకు ఆద‌ర‌ణ ల‌భిస్తోంది.

ఇదిలా ఉండ‌గా చిత్ర విజ‌యంతో ద‌ర్శ‌కుడు వేణు(Venu Balagam) వ‌రంగ‌ల్ లో పేరొందిన భ‌ద్ర‌కాళి ఆల‌యాన్ని ద‌ర్శించుకున్నారు. అమ్మ వారి దీవెన‌లు, ఆశీస్సులే త‌న సినిమా విజ‌యానికి కార‌ణ‌మ‌య్యాయ‌ని పేర్కొన్నాడు.

Also Read : బ‌లగం చిత్రానికి అవార్డుల పంట‌

Leave A Reply

Your Email Id will not be published!