Babu Jagjivan Ram : బాబూ జగ్జీవన్ రామ్ కు దేశం సలాం
భారత దేశంపై చెరగని ముద్ర
Babu Jagjivan Ram : భారత దేశంపై చెరగని సంతకం బాబు జగ్జీవన్ రామ్. చివరి వరకు విలువలకు కట్టుబడిన నాయకుడు. నెహ్రూ కేబినెట్ లో సభ్యుడు. బీహార్ లోని వెనుకబడిన వర్గాల నుంచి వచ్చారు. స్వాతంత్ర సమర యోధుడిగా గుర్తింపు పొందారు.
సంఘ సంస్కర్తగా వినుతి కెక్కారు. 40 సంవత్సరాల పాటు వివిధ పదవులు చేపట్టారు. ప్రతి పదవికి ఆయన వన్నె తెచ్చారు. సామాజిక న్యాయం సూత్రాల పరిరక్షణ కోసం పాటు పడిన అరుదైన రాజకీయ వేత్త బాబూ జగ్జీవన్ రామ్(Babu Jagjivan Ram).
ఉప ప్రధాన మంత్రిగా కూడా నిర్వహించిన ఘనత ఆయనదే. ఆయన స్వస్థలం బీహార్ రాష్ట్రంలోని చాంధ్వా ఊరులో శిబిరామ్ , వసంతిదేవి దంపతులకు ఏప్రిల్ 5, 1908లో పుట్టారు. బనారస్ హిందూ యూనివర్శిటీలో డిగ్రీ పొందారు.
చదువుకునే సమయంలో కుల వివక్షను ఎదుర్కొన్నారు బాబూ జగ్జీవన్ రామ్. అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు. తండ్రి నుంచి మానవతావాదం, ఆదర్శవాదాన్ని నేర్చుకున్నారు. గాంధీకి అనుచరుడిగా, స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించారు. 1940లో అరెస్ట్ అయ్యారు.
ఇదే సమయంలో భారత రాజ్యాంగాన్ని రూపొందించే సమయంలో దళిత జనాభా సామాజిక, రాజకీయ హక్కుల కోసం ధైర్యంగా వాదించిన ఘనత జగ్జీవన్ రామ్ దే. తొలి క్యాబినెట్ లో కార్మిక శాఖ మంత్రిగా పని చేశారు. 1966 నుంచి 67 దాకా కార్మిక, ఉపాధి, పునరావాస శాఖలు నిర్వహించారు. 1974-75 దాకా వ్యవసాయ, నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నారు.
1977 దాకా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పని చేశారు. 1936 నుంచి 1986 వరకు ఐదు దశాబ్దాలకు పైగా ఎంపీగా సేవలు అందించారు. దేశంలో అత్యధిక కాలం క్యాబినెట్ మంత్రిగా పని చేశారు. కేంద్ర సమాచార, రవాణా, రైల్వే శాఖ , ఆహార, వ్యవసాయ శాఖ లు చేపట్టారు. భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ చీఫ్ గా ఉన్నారు. విలువలే ప్రామాణికంగా బతికిన జగ్జీవన్ రామ్(Babu Jagjivan Ram) చెరగని సంతకం చేశారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శ ప్రాయంగా ఉండాలని ఆశిద్దాం.
Also Read : జనసేన జెండా బీజేపీ ఎజెండా ఒక్కటే