Ghulam Nabi Azad : ఆత్మ పరిశీలన చేసుకోండి – ఆజాద్
తనపై వస్తున్న విమర్శలపై కామెంట్స్
Ghulam Nabi Azad : మాజీ కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సానుకూల ధోరణితో ఉన్నారని, తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ సర్కార్ కు అనుకూలంగా వ్యవహరించానంటూ వచ్చిన ఆరోపణలపై స్పందించారు. తనను విమర్శించే వారు ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు.
రాజ్యసభలో వీడ్కోలు ప్రసంగాలు , సాధారణ ప్రసంగాల మధ్య తేడాను గుర్తించ లేని వారిని నిందించారు. వారి రాజకీయ చతురత ఉత్తమంగా ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఇదిలా ఉండగా గులాం నబీ ఆజాద్ ఫిబ్రవరి 15, 2021న రాజ్యసభ నుంచి పదవీ విరమణ పొందారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పాటు సాగారు.
కేంద్ర మంత్రిగా, ఎంపీగా, జమ్మూ కాశ్మీర్ సీఎంగా వివిధ హోదాలలో 50 ఏళ్ల పాటు పని చేశారు. అనుకోని రీతిలో పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఆయన పదవీ విరమణ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గులాం నబీ ఆజాద్(Ghulam Nabi Azad) గురించి ప్రశంసలు కురిపించారు. కంట తడి పెట్టారు. సభలో ఆయన లేక పోవడం తనను బాధకు గురి చేసిందని పేర్కొన్నారు.
వేరే పార్టీ పెట్టారు. ఈ సందర్భంగా తనను టార్గెట్ చేసిన వారిపై మండిపడ్డారు. తనను విమర్శిస్తున్న వారి మనసు కలుషితమైందని ఆరోపించారు. పాలిటిక్స్ లో ఏబీసీ నేర్చుకునేందుకు కిండర్ గార్డెన్ కు వెళ్లాలని సూచించారు.
Also Read : బీజేపీకి మంగళం కాంగ్రెస్ కు అందలం