Surya Kumar Yadav : సూర్య నాలుగోసారి గోల్డెన్ డక్
ఐపీఎల్ లో వరుసగా విఫలం
Surya Kumar Yadav : పొట్టి ఫార్మాట్ లో దుమ్ము రేపుతూ వచ్చిన ముంబైకి చెందిన స్టార్ హిట్టర్ సూర్య కుమార్ యాదవ్ ఐపీఎల్ 16వ సీజన్ లో మాత్రం గోల్డెన్ డక్ లో రికార్డు సృష్టిస్తున్నాడు. ఈసారి సూర్యకు అచ్చొచ్చినట్లు లేదు.మరో వైపు సోషల్ మీడియాలో సూర్య కుమార్ యాదవ్(Surya Kumar Yadav) వరుసగా డకౌట్లకు గురి కావడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. మీమ్స్ తో , విమర్శలతో, కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు.
ఇదే సమయంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ)ని ఏకి పారేస్తున్నారు. దేశంలో లేనన్ని రాజకీయాలు బీసీసీఐలో ఉన్నాయని, కేవలం అమిత్ షా తనయుడు జే షా కనుసన్నలలోనే నడుస్తోందంటూ మండి పడుతున్నారు.
గతకొంత కాలంగా అద్భుతైమన ఆట తీరుతో ఆకట్టుకుంటున్నా కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ ను పక్కన పెట్టింది. దీనిపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాంసన్ ను కాదని సూర్య కుమార్ యాదవ్ ను ఎంపిక చేయడంపై ఫైర్ అవుతున్నారు.
ఇదిలా ఉండగా ఐపీఎల్ లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్ లు ఆడింది రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్. ఇందులో మూడు మ్యాచ్ లలో ఓటమి పాలు కాగా ఒక్క మ్యాచ్ లో విజయం సాధించింది. వరుసగా నాలుగు మ్యాచ్ లలో ఒక్క పరుగు కూడా చేయలేదు సూర్య కుమార్ యాదవ్.
వాంఖెడే స్టేడియం వేదికగా ఢిల్లీలో జరిగిన లీగ్ లో మరోసారి నిరాశ పరిచాడు. ఢిల్లీ పేసర్ ముఖేష్ కుమార్ బౌలింగ్ లో డకౌట్ అయ్యాడు సూర్య కుమార్ యాదవ్. షార్ట్ బాల్ ను సిక్సర్ కొట్టే ప్రయత్నంలో వికెట్ పారేసుకున్నాడు.
Also Read : పంజాబ్ మిలటరీ స్టేషన్ లో కాల్పులు