Shikhar Dhawan Chahal : ఐపీఎల్ లో ధావ‌న్..చాహ‌ల్ టాప్

ఒక‌రు ప‌రుగుల్లో మ‌రొక‌రు వికెట్ల‌లో

Shikhar Dhawan Chahal : ఐపీఎల్ 16వ సీజ‌న్ లో చెన్నై వేదిక‌గా జ‌రిగిన ఉత్కంఠ భ‌రిత పోరులో ఎట్ట‌కేల‌కు చిర‌స్మ‌ర‌ణీయ‌మైన విజ‌యాన్ని న‌మోదు చేసింది రాజ‌స్థాన్ రాయ‌ల్స్. ఈసారి ఐపీఎల్ లో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నారు. సీనియ‌ర్ల‌తో పాటు జూనియ‌ర్లు కూడా త‌మ‌కు ఎదురే లేద‌ని చాటుతున్నారు.

ఇక ఎప్ప‌టి లాగే ఈ సీజ‌న్ లో పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ కు సార‌థ్యం వ‌హిస్తున్న ఢిల్లీ స్టార్ క్రికెట‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ త‌న‌దైన శైలిలో రాణిస్తున్నాడు. ప‌రుగుల్లో టాప్ లో కొన‌సాగుతున్నాడు ధావ‌న్(Shikhar Dhawan). మూడు మ్యాచ్ లు ఆడిన శిఖ‌ర్ 225 ర‌న్స్ చేశాడు. ఇక రెండో స్థానంలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ స్టార్ క్రికెట‌ర్ జోస్ బ‌ట్ల‌ర్ కొన‌సాగుతున్నాడు. 4 మ్యాచ్ లు ఆడిన జోస్ 204 ర‌న్స్ చేశాడు. చెన్నై సూప‌ర్ కింగ్స్ కు చెందిన రుతురాజ్ గైక్వాడ్ 197 ప‌రుగులు చేశాడు. నాల్గో స్థానంలో కొన‌సాగుతున్నాడు.

ఇక బౌలర్ల విష‌యానికి వ‌స్తే రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు చెందిన యుజ్వేంద్ర చాహ‌ల్(Chahal) 4 మ్యాచ్ ల‌లో 10 వికెట్లు తీసి టాప్ లో ఉన్నాడు. సీఎస్కే ఆట‌గాడు తుషార్ దేశ్ పాండే 4 మ్యాచ్ ల‌లో 7 వికెట్లతో , రాజస్థాన్ కు చెందిన ర‌విచంద్ర‌న్ అశ్విన్ 6 వికెట్ల‌తో మూడో స్థానంలో కొన‌సాగుతున్నాడు. వీరంతా ఆరెంజ్, ప‌ర్పుల్ క్యాప్ రేసులో ఉన్నారు.

Also Read : ధోనీ ధ‌నా ధ‌న్ రాజ‌స్థాన్ ప‌రేషాన్

Leave A Reply

Your Email Id will not be published!