MS Dhoni Sandeep Sharma : సందీప్ శర్మ వల్లే ఓడి పోయాం
చెన్నై సూపర్ కింగ్స్ చీఫ్ ఎంఎస్ ధోనీ
MS Dhoni Sandeep Sharma : ఐపీఎల్ లో భాగంగా చెన్నై చెపాక్ వేదికగా జరిగిన లీగ్ లో అనూహ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ విజయం అంచుల దాకా వచ్చి బొక్క బోర్లా పడింది. సంజూ శాంసన్ కెప్టెన్సీకి ఫిదా కావాల్సిందే.
ఎవరూ ఊహించని రీతిలో సందీప్ శర్మకు ఆఖరి ఓవర్ వేసే ఛాన్స్ ఇచ్చాడు. స్టేడియంలో ఉన్న వాళ్లు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ, జడేజా, సీఎస్కే అభిమానులు తమ జట్టు గెలుస్తుందని అనుకున్నారు. కానీ వాళ్ల ఆశలపై నీళ్లు చల్లాడు రాజస్థాన్ సీమర్ సందీప్ శర్మ.
చెన్నై గెలవాలంటే చివరి ఓవర్ లో 21 పరుగులు చేయాల్సి ఉంది. సందీప్ శర్మ మొదటి, రెండు బంతుల్ని వైడ్ గా వేశాడు. ఆ తర్వాతి బంతికి పరుగు ఇవ్వలేదు. కానీ నాలుగో, ఐదో బంతుల్ని సిక్సర్లుగా మలిచాడు జార్ఖండ్ డైనమెట్ ధోనీ. చివరి మూడు బంతుల్లో 7 పరుగులు చేయాల్సి వచ్చింది.
టార్గెట్ సులభమే అప్పటికే ఫుల్ ఫామ్ లో ఉన్నారు ధోనీ, జడేజా. కానీ సందీప్ శర్మ ఇక్కడే బోల్తా కొట్టించాడు. కేవలం ఆఖరు మూడు బాల్స్ కు మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో 3 పరుగుల తేడాతో ఓటమి పాలైంది సీఎస్కే.
మ్యాచ్ అనంతరం చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni Sandeep Sharma) మీడియాతో మాట్లాడాడు. సీమర్ సందీప్ శర్మ వల్లనే తాము ఓటమి పాలయ్యామని పేర్కొన్నాడు. అతడు అద్భుతంగా చాలా తెలివిగా బౌలింగ్ చేశాడంటూ కితాబు ఇచ్చాడు.
Also Read : శర్మ మ్యాజిక్ ధోనీ..జడేజా షాక్