GT vs PBKS IPL 2023 : గుజ‌రాత్ పంజాబ్ బిగ్ ఫైట్

స‌మ ఉజ్జీల పోరుకు రెడీ

GT vs PBKS IPL 2023 : ఐపీఎల్ 16వ సీజ‌న్ లో కీల‌క‌మైన పోరుకు రెడీ అయ్యాయి గుజ‌రాత్ టైటాన్స్ , పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ జ‌ట్లు. గురువారం 18వ లీగ్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఇరు జ‌ట్ల‌కు ఈ మ్యాచ్ అత్యంత కీల‌కం. డిఫెండింగ్ ఛాంపియ‌న్ గుజరాత్ కు(GT vs PBKS IPL 2023) కోలుకోలేని షాక్ ఇచ్చింది కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్. ఆ జ‌ట్టుకు చెందిన రింకూ సింగ్ విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ తో దుమ్ము రేపాడు. కోలుకోలేని షాక్ ఇచ్చాడు. గాయం కార‌ణంగా దూర‌మైన పాండ్యా ఈ మ్యాచ్ కు రానున్నాడు.

గురువారం జ‌రిగే ఈ కీల‌క మ్యాచ్ కు వేదిక కానుంది పంజాబ్ క్రికెట్ అసోసియేష‌న్ ఐఎస్ బింద్రా స్టేడియం. రాత్రి 7.30 గంట‌ల‌కు ప్రారంభ‌మ‌య్యే ఈ మ్యాచ్ మ‌రింత ఆస‌క్తిని రేపుతోంది. అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో ఇరు జ‌ట్లు స‌మానంగా ఉన్నాయి. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ను 5 ప‌రుగుల తేడాతో ఓడించిన పంజాబ్ కింగ్స్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్.

దీంతో ఇరు జ‌ట్లు విజ‌యం కోసం హోరా హోరీగా త‌ల‌ప‌డ‌నున్నాయి. ఐపీఎల్ లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్ల‌లో టాప్ లో కొన‌సాగుతున్నాడు పంజాబ్ కింగ్స్ స్కిప్ప‌ర్ శిఖ‌ర్ ధావ‌న్. మ్యాచ్ ను ఏ మాత్రం చేజార్చుకునేందుకు ఇష్ట‌ప‌డ‌ని త‌త్వం గుజ‌రాత్ టైటాన్స్ ది. శిఖ‌ర్ వ‌ర్సెస్ పాండ్యా మ‌ధ్య జ‌రిగే ఈ ఉత్కంఠ భ‌రిత పోరులో ఎవ‌రిని విజ‌యం వ‌రిస్తుందో చూడాలంటే రాత్రి వ‌ర‌కు ఆగాల్సిందే.

Also Read : సందీప్ శర్మ వ‌ల్లే ఓడి పోయాం

Leave A Reply

Your Email Id will not be published!