Sunder Pichai Layoffs : గూగుల్ లో మరికొందరికి ఉద్వాసన – సిఇఓ
స్పష్టం చేసిన సుందర్ పిచాయ్
Sunder Pichai Layoffs : ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకున్న ఆర్థిక మాంద్యం ప్రభావంతో దిగ్గజ కంపెనీలన్నీ తొలగింపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. మొదట ఎలాన్ మస్క్ దీనికి శ్రీకారం చుడితే ఆ తర్వాత అన్ని రంగాలకు చెందిన కంపెనీలన్నీ కొలువులకు కోత పెట్టాయి. భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన టెక్ కంపెనీ గూగుల్ ఇప్పటికే కోలుకోలేని షాక్ ఇచ్చింది. 12,000 మంది జాబర్స్ ను తొలగించింది.
తాజాగా మరో బాంబు పేల్చారు గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్(Sunder Pichai Layoffs). త్వరలోనే మరికొందరికి ఉద్వాసన పలకనున్నట్లు ప్రకటించారు. కంపెనీ సామర్థ్యాన్ని 20 శాతం ఎలా పెంచుతారంటూ మీడియా అడిగిన ప్రశ్నకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సామర్థ్యం పెరగాలంటే అదనపు భారాన్ని తగ్గించు కోవాల్సి ఉంటుందన్నాడు. ప్రస్తుతం టెక్నికల్ గా అనుభవం కలిగిన వారందరీకి ఛాన్స్ ఉంటుందన్నాడు. కానీ ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్న వారిని భరించ లేమంటూ స్పష్టం చేశాడు.
కంపెనీ చాలా ఎదిగేందుకు, పని చేసేందుకు చాలా అవకాశాలు ఇచ్చిందని కానీ వాటిని సద్వినియోగం చేసుకోక పోతే తప్పు కంపెనీది ఎలా అవుతుందని ప్రశ్నించారు సుందర్ పిచాయ్. సో రాబోయే రోజుల్లో 10 వేల మందికి పైగా ఉద్యోగులను ఇంటికి పంపించే యోచన ఉందని సంచలన ప్రకటన చేశారు గూగుల్ సిఇఓ.
Also Read : కన్నడ ‘కమలం’లో జాబితా కల్లోలం