Sandeep Sharma : ఆ క్రెడిట్ అంతా మలింగ‌..శాంస‌న్ దే

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ సీమ‌ర్ సందీప్ శ‌ర్మ

Sandeep Sharma : చెన్నై వేదిక‌గా జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు. ఆఖ‌రి ఓవ‌ర్ లో 21 ప‌రుగులు కావాల్సి ఉండ‌గా కేవ‌లం 3 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. క్రీజులో ఫినిషర్ గా పేరొందిన కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ తో పాటు స్టార్ హిట్ట‌ర్ ర‌వీంద్ర జ‌డేజా ఉన్నా జ‌ట్టును గ‌ట్టెక్కించ లేక పోయారు.

ఊహించ‌ని రీతిలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు కెప్టెన్ సంజూ శాంస‌న్ సీమర్ సందీప్ శ‌ర్మ‌కు ఛాన్స్ ఇచ్చాడు. న‌రాలు తెగే ఉత్కంఠ భ‌రిత పోరులో చివ‌ర‌కు శ‌ర్మ(Sandeep Sharma) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మొద‌టి రెండు బంతులు వైడ్ వెళ్లాయి. మూడు, నాలుగో బంతుల్ని వ‌రుస‌గా రెండు సిక్స‌ర్లు బాదాడు ధోనీ. కానీ చివ‌రి మూడు బంతులు మిగ‌లాయి. గెల‌వాలంటే 7 ర‌న్స్ చేయాలి. క్రీజులో ఫుల్ జోష్ లో ఉన్నారు ఇద్ద‌రు బ్యాట‌ర్లు.

అంతా చెన్నై సూప‌ర్ కింగ్స్ అల‌వోక‌గా విజ‌యం సాధిస్తుంద‌ని అంతా అనుకున్నారు. కానీ వారి ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లాడు సీమ‌ర్ సందీప్ శ‌ర్మ‌. ఆ మూడు బంతుల్ని క‌ట్టుదిట్టంగా వేశాడు. చివ‌ర‌కు 3 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగారు ధోనీ, జ‌డేజా. మ్యాచ్ అనంత‌రం సందీప్ శ‌ర్మ మీడియాతో మాట్లాడాడు. ఆ క్రెడిట్ అంతా త‌న‌ది కాద‌ని కెప్టెన్ సంజూ శాంస‌న్ , కోచ్ ర‌సిత్ మ‌లింగ‌కే ద‌క్కుతుంద‌ని స్ప‌ష్టం చేశాడు. ప్ర‌స్తుతం సందీప్ శ‌ర్మ చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి.

Also Read : పంజాబ్ పై విక్ట‌రీ కిక్ ఇవ్వ‌లేదు

Leave A Reply

Your Email Id will not be published!