Kodali Nani Slams : బాబు కామెంట్స్ పై కొడాలి కన్నెర్ర
అభివృద్ది లేదని నిరూపించ గలవా
Kodali Nani Slams : టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని నిప్పులు చెరిగారు. ఆయన చెప్పినవన్నీ అబద్దాలని పేర్కొన్నారు. శుక్రవారం కొడాలి నాని(Kodali Nani Slams) మీడియాతో మాట్లాడారు. కోట్లాది రూపాయలతో గుడివాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ది చేస్తున్నామని చెప్పారు.
పొద్దున లేచి నప్పటి నుంచి రాత్రి పడుకునేంత దాకా వైసీపీని, సీఎం జగన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వచ్చిన చంద్రబాబు నాయుడి మాటలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. 2019లో వచ్చిన ఫలితాలే వచ్చే ఎన్నికల్లో రిపీట్ అవుతాయని జోష్యం చెప్పారు.
చంద్రబాబు నాయుడిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయనను ఓ 420 గా పేర్కొన్నారు. రామోజీరావుకు మేలు చేకూర్చేలా చేశాడని మండిపడ్డారు. పరిపాలనా పరంగా సంస్కరణలు తీసుకు వచ్చిన ఘనత తమకు దక్కుతుందన్నారు.
అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట. లేనప్పుడు ఇంకో మాట మాట్లాడటం చంద్రబాబు నాయుడుకు(Chandrababu Naidu) అలవాటుగా మారిందన్నారు. ఒక రకంగా చెప్పాలంటే బాబు గురించి ప్రస్తావించడం వేస్ట్ అన్నారు. టీడీపీ చీఫ్ పాడె ఎక్కేందుకు రెడీగా ఉన్నాడని ఎద్దేవా చేశారు. టీడీపీ చీఫ్ మాటలకు విలువ లేదన్నారు. కేవలం అధికారం కోసమే ఎన్టీఆర్ పేరును వాడుకుంటున్నాడని ఆరోపించారు.
Also Read : కొడాలి నానిపై చంద్రబాబు సెటైర్