PM Modi Assam Visit : దేశాభివృద్ది బీజేపీ లక్ష్యం – మోదీ
ప్రజా సేవకే తమ పార్టీ ప్రయారిటీ
PM Modi Assam Visit : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. మరోసారి ప్రతిపక్షాలను టార్గెట్ చేశారు. భారతీయ జనతా పార్టీ దేశాభివృద్దే ధ్యేయంగా ముందుకు వెళుతోందన్నారు. ప్రజా సేవనే పరమావధిగా పని చేస్తోందని చెప్పారు. శుక్రవారం అస్సాంలో పర్యటించారు ప్రధానమంత్రి. ఈ సందర్భంగా రూ. 14,300 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. అధికార ఆకలితో ఉన్న ప్రజలు దేశానికి చాలా హానీ చేశారంటూ విపక్షాలను ఉద్దేశించి ఎద్దేవా చేశారు నరేంద్ర మోదీ(PM Modi Assam Visit) .
కొన్ని దశాబ్దాలుగా ఈ దేశాన్నిపాలించిన వాళ్లు తమను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. గత కొన్నేళ్లుగా మీరే పవర్ లో ఉన్నారు. మరి దేశం కోసం ఏం చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు ప్రధానమంత్రి. మీరు చేసిన అప్పులను తీర్చేందుకే సమయం చాలడం లేదన్నారు. ఇవాళ దేశాన్ని అన్ని రంగాలలో ముందంజలో ఉండేలా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు ప్రధానమంత్రి.
.అధికార బీజేపీ దేశం, ప్రజల సేవలో నిమగ్నై ఉందన్నారు. దేశం పట్ల నిబద్ధత , భక్తి దాని ప్రయత్నాలలో ప్రధానమని స్పష్టం చేశారు మోదీ. చారిత్రాత్మక బిహూర్ వేడుకలకు ముందు అస్సాంలోని గౌహతిలో జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి పాల్గొని ప్రసంగించారు. కేవలం అధికారం కోసమే వారు పాకులాడుతున్నారని కానీ వారికి ప్రజల పట్ల ప్రేమ లేదన్నారు మోదీ.
Also Read : బీజేపీ నుంచి వలసలు తప్పవు – డీకే