BCCI : సౌదీ క్రికెట్ లీగ్ లో మనోళ్లు ఆడరు
తేల్చి చెప్పిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు
BCCI : పొట్టి ఫార్మాట్ కు ప్రమాదం రాబోతోంది. ప్రస్తుతం క్రికెట్ ను ఊపేస్తోంది..శాసిస్తోంది..కోట్లాది మందిని ఆకట్టుకునేలా చేస్తోంది. డాలర్ల పంట పండిస్తోంది. బీసీసీఐకి గణనీయమైన ఆదాయం తీసుకు వచ్చేలా చేస్తోంది ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్ ). దీనికి పోటీగా పలు దేశాలు ప్రయత్నాలు చేసినా ఇప్పటి దాకా సక్సెస్ కాలేక పోయాయి.
ప్రస్తుతంపై దీనిపై కన్నేసింది సౌదీ అరేబియా. ఇప్పటికే పలు ఆటలకు సంబంధించి టోర్నీలు నిర్వహిస్తోంది సౌదీ. ఆ దేశానికి కాసుల పంట పండుతోంది. ఈ తరుణంలో ప్రపంచంలోనే అత్యంత భారీ ఐపీఎల్ కు ప్లాన్ చేస్తోందని సమాచారం.
దీంతో ఒక్కసారిగా బీసీసీఐ కుదుపునకు లోనైంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఐపీఎల్ లో ఆడే ఆటగాళ్లు ఎవరూ బయట దేశాలలో జరిగే లీగ్ లలో ఆడేందుకు వీలు లేదు. ముందే బీసీసీఐ కాంట్రాక్టు చేయించుకుంటుంది. ఇక విదేశాలకు చెందిన ఆటగాళ్లు పెద్ద ఎత్తున భారత ఐపీఎల్ లో ఆడేందుకు మొగ్గు చూపుతారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఐపీఎల్ లో భారీగా డబ్బులు ఆయా ఆటగాళ్లకు ఫీజుల రూపంలో అందుతున్నాయి.
ఇక సౌదీ అరేబియా వరల్డ్స్ రిచెస్ట్ టి20 లీగ్ ను ప్లాన్ చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు స్పందించింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. భారత దేశానికి చెందిన ఏ క్రికెటర్ సదరు లీగ్ లో ఆడబోరంటూ ప్రకటించింది.
Also Read : సిఖందర్ రజా షాన్ దార్