Shimron Hetmyer : షిమ్రోన్ హెట్మెయ‌ర్ ‘హిట్’మ‌య‌ర్

గుజ‌రాత్ కు విండీస్ స్టార్ బిగ్ షాక్

Shimron Hetmyer : గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ లో మెరుగైన ట్రాక్ రికార్డ్ క‌లిగి ఉన్న హార్దిక్ పాండ్యా సేన‌కు చుక్క‌లు చూపించారు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ స్కిప్ప‌ర్ సంజూ శాంస‌న్ , షిమ్రోన్ హిట్మెయ‌ర్. 32 బంతులు ఎదుర్కొన్న స్కిప్ప‌ర్ 3 ఫోర్లు 5 సిక్స‌ర్లతో రెచ్చి పోయాడు. 60 ర‌న్స్ చేశాడు. కీల‌క‌మైన పాత్ర పోషించాడు. 178 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలోనే జోస్ బ‌ట్ల‌ర్ , జైశ్వాల్ వికెట్ల‌ను కోల్పోయింది. ఈ స‌మ‌యంలో ప‌డిక్క‌ల్ , సంజూ శాంస‌న్ ఇన్నింగ్స్ ను చ‌క్క‌దిద్దారు. 6 ఓవ‌ర్లు పూర్త‌య్యే స‌రికి రాజ‌స్థాన్ స్కోర్ క‌నీసం 30 కూడా దాట‌లేదు.

ఈ త‌రుణంలో 15వ ఓవ‌ర్ లో వెనుదిరిగాడు అప్ప‌టి వ‌ర‌కు స‌త్తా చాటిన సంజూ శాంస‌న్. రియాన్ ప‌రాగ్ నిరాశ ప‌రిచినా క్రీజులోకి వ‌చ్చాడు విండీస్ స్టార్ షిమ్రోన్ హెట్మ‌య‌ర్. కేవ‌లం 26 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్న షిమ్రోన్ 2 ఫోర్లు 5 భారీ సిక్స‌ర్ల‌తో రెచ్చి పోయాడు. ధ్రువ్ జురైల్ , ర‌విచంద్ర‌న్ అశ్విన్ కీల‌క పాత్ర పోషించారు. ష‌మీ బౌలింగ్ లో వ‌చ్చీ రావ‌డంతోనే అశ్విన్ 4, 6తో షాక్ ఇచ్చాడు.

ఆ త‌ర్వాత సుల‌భ‌మైన క్యాచ్ ఇచ్చి వెనుదిరిగినా మైదానంలో చివ‌రి దాకా నిలిచి ఉన్నాడు హెట్మెయ‌ర్(Shimron Hetmyer). చివ‌ర‌కు ఆఖ‌రు ఓవ‌ర్ లో 7 ప‌రుగులు కావాల్సి వ‌చ్చింది. మొద‌టి బంతికి షిమ్రోన్ 2 ర‌న్స్ చేశాడు. ఇంకా 5 బంతులు 5 ర‌న్స్ కావాలి. దీంతో రెండో బంతిని సిక్స‌ర్ గా మ‌లిచాడు. మ‌రోసారి తాను రియ‌ల్ ఫినిష‌ర్ న‌ని నిరూపించాడు.

Also Read : సంజూ శాంస‌న్ మార‌థాన్ ఇన్నింగ్స్

Leave A Reply

Your Email Id will not be published!