Surya Kumar Nitish Rana Fine : సూర్య..రాణా..హృతిక్ కు ఫైన్
మ్యాచ్ ఫీజులో భారీగా కోత విధింపు
Surya Kumar Nitish Rana Fine : వాళ్లు క్రికెటర్లు. ఆదర్శంగా ఉండాల్సిన వాళ్లు కట్టు తప్పుతున్నారు. వాళ్లను వేలాది మంది అభిమానులు ఆరాధిస్తారు. వాళ్ల లాగా ఉండాలని కోరుకుంటారు. కానీ మైదానంలో అన్నింటిని మరిచి బూతులకు దిగితే ఏమని అనుకోవాలి. ఆ ఇద్దరు ఎవరో కాదు ఒకరు ముంబై ఇండియన్స్ తాత్కాలిక స్కిప్పర్ సూర్య కుమార్ యాదవ్ కాగా మరొకరు కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ నితీష్ రాణా(Surya Kumar Nitish Rana Fine).
186 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంకా 14 బంతులు ఉండగానే ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. జోరు మీదున్న కోల్ కతా నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చింది. విజయం పొందిన ఆనందంలో ఉన్న ముంబై సేన చీఫ్ కు బిగ్ షాక్ ఇచ్చింది ఐపీఎల్ క్రమశిక్షణ కమిటీ. స్లో ఓవర్ రేట్ కారణంగా భారీగా జరిమానా విధించారు. ఇందుకు సంబంధించి రూ. 12 లక్షలు ఫైన్ విధించినట్లు తెలిపారు. రెండోసారి ఇలాగే జరిగితే రూ. 24 లక్షలు ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.
ముంబై బౌలర్ హృతిక్ షోకీన్ కోల్ కతా కెప్టెన్ నితీశ్ రాణా గొడవ పడ్డారు. ఇద్దరూ బూతులు తిట్టుకున్నారు. దీనిని సీరియస్ గా తీసుకున్న ఐపీఎల్ నిర్వాహకులు రాణా మ్యాచ్ ఫీజులో 25 శాతం ఫైన్ విధించారు. హృతిక్ మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించినట్లు తెలిపారు. ఈ ఇద్దరు ప్లేయర్లు కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ అతిక్రమించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.
Also Read : పాండ్యా తీరుపై సర్వత్రా ఆగ్రహం