Tilak Varma House : తిల‌క్ వ‌ర్మ ఇంట్లో ‘ముంబై’ సంద‌డి

ఆతిథ్యం ఇచ్చిన హైద‌రాబాద్ క్రికెట‌ర్

Tilak Varma House : ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజ‌న్ లో భాగంగా స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ తో లీగ్ మ్యాచ్ ఆడేందుకు ముంబై ఇండియ‌న్స్ టీం భాగ్య‌న‌గరానికి విచ్చేసింది. ఈ సంద‌ర్భంగా అరుదైన స‌న్నివేశం చోటు చేసుకుంది.

హైద‌రాబాద్ కు చెందిన ఆట‌గాళ్లు ఇద్ద‌రు ఇప్పుడు దేశ వ్యాప్తంగా పేరు పొందారు. వారిలో ఒక‌రు స్టార్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ కాగా మ‌రొక‌రు తిల‌క్ వ‌ర్మ‌(Tilak Varma). బౌలింగ్ ప‌రంగా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌ర‌పున సిరాజ్ ఆడుతుండ‌గా తిల‌క్ వ‌ర్మ ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు.

గ‌త ఏడాది ఐపీఎల్ 15వ సీజ‌న్ లో అద్భుత‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకున్నారు. ఇక ఈ ఏడాది జ‌రుగుతున్న ఐపీఎల్ సీజ‌న్ లో సైతం కీల‌క పాత్ర పోషించాడు. ఇదిలా ఉండ‌గా ఇవాళ ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు స‌భ్యులంతా తిల‌క్ వ‌ర్మ ఇంటికి(Tilak Varma House) విచ్చేశారు. వారికి సాద‌రంగా ఆహ్వానం ప‌లికారు తిల‌క్ వ‌ర్మ కుటుంబీకులు. స్వ‌యంగా చేసిన వంట‌కాల‌ను జ‌ట్టుకు వ‌డ్డించారు.

వ‌ర్మ ఇంటిని సంద‌ర్శించిన వారిలో జ‌ట్టు మెంట‌ర్ , మాజీ క్రికెటర్ స‌చిన్ ర‌మేష్ టెండూల్క‌ర్, ముంబై కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, సూర్య కుమార్ యాద‌వ్ , పీయూష్ చావ్లా, ఇషాన్ కిష‌న్ , అర్జున్ టెండూల్క‌ర్ ఉన్నారు. కుటుంబీకుల‌తో క‌లిసి ఫోటోలు దిగారు. ప్ర‌స్తుతం అవి వైర‌ల్ గా మారాయి. ఇప్ప‌టి దాకా 4 మ్యాచ్ లు ఆడిన తిల‌క్ వ‌ర్మ 177 ర‌న్స్ చేశాడు.

Also Read : ముంబై ఇండియ‌న్స్ థ్రిల్లింగ్ విక్ట‌రీ

Leave A Reply

Your Email Id will not be published!