RR vs LSG IPL 2023 : లక్నో చేతిలో రాజస్తాన్ విలవిల
10 పరుగుల తేడాతో ఓటమి
RR vs LSG IPL 2023 : రాజస్థాన్ లోని జైపూర్ స్టేడియంలో జరిగిన 26వ లీగ్ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటి దాకా పాయింట్ల పట్టికలో టాప్ లో ఉన్న రాజస్థాన్ రాయల్స్(RR vs LSG IPL 2023) కు షాక్ ఇచ్చింది.
కెప్టెన్ సూంజూ శాంసన్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కేవలం 154 రన్స్ మాత్రమే చేసింది. కేఎల్ రాహుల్ , మేయర్స్ సత్తా చాటారు. అనంతరం 155 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ అద్భుతంగా ప్రారంభించింది. 10 ఓవర్ల దాకా ఒక్క వికెట్ పడలేదు.
అప్పటికే యశస్వి జైశ్వాల్ , జోస్ బట్లర్ ఫుల్ ఫామ్ ఉన్నా ఫలితం లేక పోయింది. జైశ్వాల్ ఔట్ అయ్యాక వచ్చిన కెప్టెన్ సంజూ శాంసన్ రనౌట్ పెద్ద దెబ్బ కొట్టింది. ఆ తర్వాత వచ్చిన షిమ్రోన్ హెట్మెయర్ నిరాశ పరిచాడు. రాజస్థాన్ క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోతూ వచ్చింది. దేవదత్ పడికల్ ఆలస్యంగా దాడి చేసినా ఫలిత లేక పోయింది. 10 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆరు మ్యాచ్ లు ఆడి 4 గెలిచింది. 2 ఓడి పోయింది. లక్నో బౌలర్లు స్టాయినిస్ , ఆవేష్ ఖాన్ రాజస్థాన్ ను దెబ్బ కొట్టారు.
Also Read : మెరిసిన కైల్ మేయర్స్