DC vs KKR IPL 2023 : ఈసారైనా ఢిల్లీ క్యాపిటల్స్ రాణిస్తుందా
వరుస పరాజయాలతో జాబితాలో ఆఖరున
DC vs KKR IPL 2023 : రిషబ్ పంత్ గాయం ఢిల్లీ క్యాపిటల్స్ కు పెద్ద శాపంగా మారింది. ఇక అతడి స్థానంలో ఆసిస్ స్టార్ డేవిడ్ వార్నర్ కు ఛాన్స్ ఇచ్చింది యాజమాన్యం. వ్యక్తిగతంగా బాగానే ఆడుతున్నా సమిష్టిగా ఢిల్లీ క్యాపిటల్స్(DC vs KKR IPL 2023) రాణించ లేక పోయింది. ఇప్పటి దాకా ఆడిన అన్ని మ్యాచ్ ల్లోనూ ఆ జట్టు ఓటమి మూటగట్టుకుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ కు డైరెక్టర్ గా బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీని నియమించినా ఫలితం లేకుండా పోయింది. ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ ఒక్కరూ బాధ్యతా యుతంగా ఆడడం లేదు. అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోనూ తేలి పోయారు. దీంతో తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి.
మరో వైపు కోల్ కతా నైట్ రైడర్స్ వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓడి పోయింది. కోల్ కతా బలీయంగా ఉంది. ఆ జట్టుకు మోస్ట్ డేంజరీస్ రూపంలో రింకూ సింగ్ ఉన్నాడు. కెప్టెన్ నితీశ్ రాణా కూడా బాగానే ఆడుతున్నాడు. ఇక మొత్తంగా చూస్తే ఢిల్లీ క్యాపిటల్స్ కంటే బలంగా ఉంది కోల్ కతా నైట్ రైడర్స్ . టి20 మ్యాచ్ లో ఎవరు ఎప్పుడు గెలుస్తారో చెప్పడం చాలా కష్టం.
Also Read : గెలవాల్సిన మ్యాచ్ లో బోల్తా పడ్డారు