Virat Kohli Captain : ఆర్సీబీ స్కిప్ప‌ర్ గా ర‌న్ మెషీన్

గాయంతో త‌ప్పుకున్న ఫాఫ్ డుప్లెసిస్

Virat Kohli Captain : ఐపీఎల్ 16వ సీజ‌న్ లో భాగంగా ఇవాళ కీల‌క మ్యాచ్ మొద‌లైంది. శిఖ‌ర్ ధావ‌న్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ తో రాయల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌ల‌ప‌డ‌నుంది. ఇదిలా ఉండ‌గా అనుకోని రీతిలో ఆర్సీబీ యాజ‌మాన్యం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు స్టార్ క్రికెట‌ర్ , మాజీ భార‌త జ‌ట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli Captain) ఈ మ్యాచ్ కు సార‌థిగా వ్య‌వ‌హ‌రిస్తాడ‌ని తెలిపింది. ఇప్ప‌టికే నాయ‌క‌త్వం వ‌హిస్తున్న ఫాఫ్ డు ప్లెసిస్ కు గాయం కావ‌డంతో త‌ప్పు కోవాల్సి వ‌చ్చింది.

అయితే ఒక‌వేళ గాయం పెద్ద‌ది కాక పోయిన‌ట్లయితే మ్యాచ్ ప‌రిస్థితిని బ‌ట్టి ఫాఫ్ డుప్లెసిస్ ఇంపాక్ట్ ప్లేయ‌ర్ గా రంగంలోకి దిగే ఛాన్స్ ఉంది. ఐపీఎల్ లో ఇప్ప‌టి వ‌ర‌కు అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్ల‌లో విరాట్ కోహ్లీ టాప్ 5 లో కొన‌సాగుతున్నాడు. ప‌లు రికార్డులు బ‌ద్ద‌లు కొట్టాడు. ఆర్సీబీకి స్కిప్ప‌ర్ గా కూడా ప‌ని చేశాడు. అయితే దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ లో భాగంగా తాను త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.

ఆర్సీబీ యాజ‌మాన్యం మొద‌ట ఒప్పుకోలేదు. చివ‌ర‌కు తాను కుటుంబానికి దూరంగా ఉన్న‌ట్లు భావిస్తున్నాన‌ని త‌న‌కు ఇక కెప్టెన్సీ బాధ్య‌త‌లు వ‌ద్దంటూ కోరాడు. దీంతో విరాట్ కోహ్లీ(Virat Kohli) స్థానంలో ఫాఫ్ డు ప్లెసిస్ కు స్కిప్ప‌ర్ బాధ్య‌త‌లు అప్ప‌గించింది. కాగా గాయం కార‌ణంగా త‌ప్పుకోవ‌డంతో మ‌రోసారి ఫ్యాన్స్ కు కెప్టెన్ గా కోహ్లీని చూసే ఛాన్స్ ద‌క్క‌డంతో ఫుల్ ఖుషీగా ఫీల‌వుతున్నారు.

Also Read : బెంగ‌ళూరు పంజాబ్ నువ్వా నేనా

Leave A Reply

Your Email Id will not be published!