Bilawal Bhutto : ద్వైపాక్షిక కోణంలో చూడకండి – భుట్టో
విదేశాంగ శాఖ మంత్రి షాకింగ్ కామెంట్స్
Bilawal Bhutto : పాకిస్తాన్ ను ఉగ్రవాద కోణంలో చూడవద్దంటూ స్పష్టం చేశారు ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో. భారత్ లో పర్యటించనున్నారు. బిలావల్ భుట్టో, జర్దారీల భారత పర్యటన 2011 లో హీనా రబ్బానీ ఖర్ తర్వాత భుట్టో మొదటి పర్యటన ఇది.
బిలావల్ భుట్టో(Bilawal Bhutto) పాకిస్తాన్ లో మీడియాతో మాట్లాడారు. భారత్ లో జరిగిన షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ సమావేశంలో తాను పాల్గొనడం ఎస్సిఓ చార్టర్ పట్ల ఇస్లామాబాద్ కు ఉన్న నిబద్ధతను ప్రతిబింబిస్తోందన్నారు. ద్వైపాక్షిక సంబంధాల కోణంలో చూడవద్దని విదేశాంగ శాఖ మంత్రి.
దున్యా న్యూస్ లో ప్రసారమైన ఓ కార్యక్రమంలో అడిగిన ప్రశ్నకు బిలావల్ భుట్టో సమాధానం ఇచ్చారు. వచ్చే నెలలో గోవాలో జరిగే విదేశాంగ మంత్రుల సమావేశంలో తాను పాకిస్తాన్ కు ప్రాతినిధ్యం వహిస్తానని చెప్పారు.
మే 4, 5 తేదీల్లో గోవాలో జరిగే విదేశాంగ మంత్రుల సమావేశానికి భుట్టో జర్దారీ పాక్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత దేశ విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ ఆహ్వానం మేరకు భుట్టో(Bilawal Bhutto) హాజరవుతున్నట్లు విదేశాంగ కార్యాలయ ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ స్పష్టం చేశారు.
Also Read : ఢిల్లీ కోర్టులో మహిళపై కాల్పులు