Miller Knoll CEO : సిబ్బందికి క్షమాపణ చెప్పిన సిఇఓ
ఈమెయిల్స్ ద్వారా లేఖలు
Miller Knoll CEO : ప్రముఖ అమెరికన్ ఫర్నీచర్ కంపెనీ మిల్లెర్ నాల్ సిఇఓ(Miller Knoll CEO) ఆండీ ఓవెన్ నోరు జారారు. ఆపై సిబ్బందిపై నోరు పారేసుకున్నందుకు చివరకు క్షమాపణలు చెప్పారు. పని చేస్తున్న తమకు బోనస్ లు ఇవ్వాలని సిబ్బంది కోరారు. దీనిపై సీరియస్ గా రియాక్ట్ అయ్యింది ఆండీ ఓవెన్. పని చేయండి లేదంటే ఈ నగరాన్ని వదిలి పోండి అంటూ కటువుగా పేర్కొంది.
ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. దీంతో పరిస్థితి మరింత చర్చనీయాంశంగా మారడంతో ఆండీ ఓవెన్ తన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరారు. మీ మనసు నొప్పిస్తే దయచేసి క్షమించాలని కోరారు మిల్లెర్ నాల్ సిఇఓ.
ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయ్యింది. ఆమెకు ఎదురు దెబ్బ తగిలింది. కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రయత్నం చేయండి. అంతే కానీ బోనస్ లు అడిగితే ఎలా అని ప్రశ్నించింది ఆండీ ఓవెన్. ఒకరినొకరు బాగా చూసుకోండి. దయగా ఉండండి. గౌరవంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. పలువురికి ఆదర్శ ప్రాయంగా ఉండాలని కోరారు ఆండీ ఓవెన్.
బోనస్ లు ఇవ్వక పోతే తాము ఎలా ఉత్సాహంగా ఉంటామని, ఎలా పని చేస్తామంటూ ఉద్యోగులు తిరిగి ప్రశ్నించారు. నేను ఊహించని విధంగా మేము చాలాసార్లు ఎదుర్కొన్న ఒక సవాల్ గురించి ప్రస్తావించానని తెలిపారు. అందుకు చేసిన ప్రయత్నానికి జట్టుకు శక్తిని ఇవ్వాలని నేను ఆశించానని తెలిపింది. అందుకు నన్ను క్షమించండని వేడుకుంది. చివరకు సారీ చెప్పడంతో సద్దు మణిగింది ఈ వ్యవహారం.
Also Read : ఢిల్లీ కోర్టులో మహిళపై కాల్పులు