IPl 2023 Playoffs Final : ఐపీఎల్ ప్లే ఆఫ్స్..ఫైనల్ షెడ్యూల్
ప్రకటించిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు
IPL 2023 Playoffs Final : ఐపీఎల్ 16వ సీజన్ ఆద్యంతమూ ఆకట్టుకుంటోంది. కోట్లాది మంది ప్రతి రోజూ లీగ్ మ్యాచ్ లను వీక్షిస్తున్నారు. కోట్లాది రూపాయల ఆదాయం సమకూరుతోంది బీసీసీఐకి. పలు మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఇప్పటికే పాయింట్ల పట్టికలో రాజస్థాన్ టాప్ లో ఉండగా లక్నో 2వ స్థానంలో , 3వ ప్లేస్ లో చెన్నై, 4వ స్థానంలో గుజరాత్ టైటాన్స్ నిలిచింది. ఇంకా మ్యాచ్ లు ఆడాల్సి ఉండడంతో ఏ జట్లు ప్లే ఆఫ్స్ కు చేరుకుంటాయో వేచి చూడాల్సి ఉంది.
ఐపీఎల్ 2023కి సంబంధంచి ప్లే ఆఫ్ లు, ఫైనల్ కు(IPL 2023 Playoffs Final) సంబంధించిన షెడ్యూల్ ను తాజాగా బీసీసీఐ ప్రకటించింది. మూడు ప్లే ఆఫ్ మ్యాచ్ లు క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్ , క్వాలిఫైయర్ 2 వరుసగా మే 23, మే 24 , మే 26 తేదీల్లో జరుగుతాయి.
మే 28న గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. క్వాలిఫయర్ , ఎలిమినేటర్ చెన్నైలో జరుగుతాయని వెల్లడించింది. క్వాలిఫయర్ -2 అహ్మదాబాద్ లో జరగనుంది.
ప్లే ఆఫ్ మ్యాచ్ లు చెన్నై, అహ్మదాబాద్ ,చిదంబరం స్టేడియాలలో జరుగనున్నాయి. మే 24న ఎలిమినేటర్ మ్యాజ్ జరగనుంది. నరేంద్ర మోదీ స్టేడియం క్వాలిఫైయర్ 2 , ఫైనల్ వరుసగా మే 26, 28 తేదీల్లో ఆతిథ్యం ఇవ్వనుంది.
Also Read : ఆ కెప్టెన్లకు ఐపీఎల్ రూల్స్ బెడద